ltrScrptTheme3

సామి.. అమ్మి...

Oct 26 2021 @ 05:05AM

‘సామి..’, ‘అమ్మి...’ అంటూ అల్లు అర్జున్‌, రష్మిక మందన్న ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటున్నారు. అయితే అది ‘పుష్ప’ చిత్రం కోసమే. సుకుమార్‌ దర్శకత్వంలో వారిద్దరూ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా నుంచి మూడో పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. చంద్రబోస్‌ రాసిన ‘సామి సామి...’ అనే గీతాన్ని దేవి శ్రీ ప్రసాద్‌ స్వరకల్పనలో మోనిక యాద వ్‌ ఆలపించారు. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.