స్టీల్‌ప్లాంట్‌లో ప్రశాంతంగా సమ్మె

ABN , First Publish Date - 2020-11-27T05:29:27+05:30 IST

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగాస్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం సమ్మె ప్రశాంతంగా సాగింది.

స్టీల్‌ప్లాంట్‌లో ప్రశాంతంగా సమ్మె
స్టీల్‌ప్లాంట్‌ గేటు వద్ద అఖిలపక్ష కార్మిక నేతల ఆందోళన

ఉక్కుటౌన్‌షిప్‌: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగాస్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం  సమ్మె ప్రశాంతంగా సాగింది. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక సంఘ నాయకులు ఉద యాన్నే ఉక్కు ప్రధాన గేటు, విస్తరణ గేటు, బీసీ గేటుల వద్దకు చేరుకున్నారు. ఉత్పత్తికి అంతరాయం లేకుండా  అధికారులు చర్యలు తీసుకున్నారు.  ఏసీపీ రామాంజనేయరెడ్డి, స్టీల్‌ప్లాంట్‌ సీఐ అవాంఛనీయ సంఘటనలు చో టు చేసుకోకుండా రక్షణ చర్యలు చేపట్టారు. సమ్మె సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ గేటు వద్ద జరిగిన ఽధర్నాలో నేతలు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ జోలికి వస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, వై.మస్తానప్ప, వైటి.దాసు, గణపతిరెడ్డి, కోగంటి లెనిన్‌బాబు, నమ్మి సింహాద్రి, డీవీ.రమణారెడ్డి, సురేష్‌బాబు, గంధం వెంకటరావు, నీరుకొండ రామచంద్రరావు పాల్గొన్నారు.  

లంకెలపాలెం: స్థానిక కూడలిలో సిటూ ఆధ్వర్యం లో ఆందోళన చేపట్టారు.  జాతీయ రహదారిపై రాస్తారో కో చేశారు. నేతలు గనిశెట్టి సత్యనారాయణ, శ్రీనివాసరా వు,  మాణిక్యం, దేవి, రమణి, లక్ష్మి పాల్గొన్నారు.


సబ్బవరం: జాతీయ రహదారిపై రాస్తారోకో, దుర్గమాంబ ఆలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకూ నిరసన ప్రదర్శన, ఎన్టీఆర్‌ కూడలి వద్ద మానవ హారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.  రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గండి నాయనిబాబు, సత్యవతి,  రమణమ్మ,  భవానీ, కోటి, సోంబాబు పాలొన్నారు. 


పరవాడలో మిశ్రమ స్పందన

పరవాడ: సమ్మెకు పరవాడలో మిశ్రమ స్పందన లభించింది. తుఫాన్‌ కారణంగా సమ్మె ప్రభావం కనిపించలేదు.  సిటూ ఆధ్వర్యంలో ఆశా, అంగన్‌వాడీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, డ్వాక్రా వీవోఏలు, ముఠా కార్మికులు జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. సిటూ నేతలు గనిశెట్టి సత్యనారాయణ, వీవీ శ్రీనివాసరావు, పి.మాణిక్యం, దేవి, రమణి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. 


భెల్‌లో సమ్మె పాక్షికం..

అక్కిరెడ్డిపాలెం:  కార్మిక సమ్మె భెల్‌లో పాక్షికంగా జరిగింది. ఇంటక్‌, సీఐటీయూ, వైఎస్‌ఆర్‌టీయూసీ ఆధ్వ ర్యంలో మెయిన్‌గేటు ఎదుట నిరసన చేపట్టారు.  సమ్మెకు మద్దతు తెలపాలని కార్మికులను కోరినప్పటికీ  అధికశాతం మంది విధులకు హాజరయ్యారు. 68, 69 వార్డుల పరిధఙలో బ్యాంకులు సమ్మెకు మద్దతు తెలపగా, మింది రహదారిలోని పరిశ్రమల కార్మికులంతా విధులకు హాజరయ్యారు.


సార్వత్రిక సమ్మె విజయవంతం

మల్కాపురం: దేశవ్యాప్త సమ్మె పారిశ్రామిక ప్రాంత ంలో విజయవంతమైంది. జోరున వర్షం కురిస్తున్నా నేవల్‌ డాక్‌యార్డు, షిప్‌యార్డు, హెచ్‌పీసీఎల్‌, కోరమాండల్‌ ఎరువుల కర్మాగారం పరిశ్రమల వద్దకు అఖిలపక్షాల నాయకులు వేకువజామునే చేరుకుని ఆందోళన చేశారు. ఈ పరిశ్రమలలో  30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు విధులకు హాజరుకాలేదు. ఏఐటీయూసీ నాయకులు కోరమాండల్‌ గేటు నుంచి శ్రీహరిపురం వరకు ర్యాలీ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌ సత్యనారాయణమూర్తి(నాని), రాంబాబు, సత్యాంజనేయ, వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడు కలిదిండి బద్రీనాథ్‌, సీఐటీయూ నేతలు ఎం.జగ్గునాయు డు, లక్ష్మణమూర్తి, పైడిరాజు, పెంటారావు, ఇంటక్‌ నేత లు నరసింగరావు, కృష్ణ, టీఎన్‌టీయూసీ నేతలు నక్కా లక్ష్మణరావు, కె.ఆది, బీఏఎంసీఈఎఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ నేత కాకర రమణ తదితరులు పాల్గొన్నారు. 


ఆటోనగర్‌:  సార్వత్రిక సమ్మెకు ఆటోనగర్‌ కార్మిక సంఘ నాయకులు, కార్మికులు మద్దతు తెలిపారు.  వర్షం లోనూ జెండాలు పట్టుకుని ర్యాలీ చేశారు. జి.జిసుబ్బారావు, రాంబాబు, రమణ,  కార్మికులు పాల్గొన్నారు. 


ఎన్‌ఎస్‌టీఎల్‌ వద్ద..

ఎన్‌ఏడీ జంక్షన్‌: ఎన్‌ఎస్‌టీఎల్‌లో సివిల్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం నాయకు లు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నేతలు సీహెచ్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, హేమం త్‌, సీహెచ్‌ చంద్రశేఖర్‌,  వర్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్‌ఏడీ ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఎన్‌ఏడీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.మారయ్య, యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.


వేపగుంట:  స్థానిక కూడలిలో అంగన్‌వాడీ, భవన నిర్మాణ, వివిధ కార్మిక సంఘాల నేతలు నిరసన తెలిపారు. సీపీఐ జిల్లా పార్టీ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, ఆర్‌.శ్రీనివాసరావు, వై.త్రినాథ్‌, ఎ.రాంబాబు, అనిత, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:29:27+05:30 IST