సార్వత్రిక సమ్మె సక్సెస్‌

ABN , First Publish Date - 2020-11-27T05:34:18+05:30 IST

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మార్చు కోకపోతే ప్రపంచ నియంత హిట్లర్‌కు పట్టిన గతే పడుతుం దని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు.

సార్వత్రిక సమ్మె సక్సెస్‌
ఏలూరులో వివిధ కార్మిక సంఘాల భారీ ర్యాలీ

గళమెత్తిన కార్మికులు.. జిల్లావ్యాప్తంగా ర్యాలీలు

మోదీ తీరుపై విమర్శలు

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 26 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మార్చు కోకపోతే ప్రపంచ నియంత హిట్లర్‌కు పట్టిన గతే పడుతుం దని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురు వారం జాతీయస్థాయిలో జరిగిన సార్వత్రిక సమ్మెకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఏలూరు, భీమవ రం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, కుక్కునూరు, వేలేరు పాడు, నరసాపురం తదితర ప్రాంతాల్లో కార్మికులు నిరసన ర్యాలీలు చేపట్టారు. తుఫాన్‌ ప్రభావంతో వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యో గులు భారీ సంఖ్యలో రోడ్డెక్కారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్‌ కోడ్‌లను, రైతులకు నష్టం కలిగించే మూడు వ్యవసా య చట్టాలను, ప్రజలకు భారగంగా మారే విద్యుత్‌ సంస్థల చట్టాన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఏలూరులో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇప్టూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూట్‌ కార్మికులు, హమాలీలు, సిగార్‌, మునిసిపల్‌, ఐఎంఎల్‌ వివిధ ఫ్యాక్టరీలు, సంస్థలు, రైస్‌మిల్లులు, విద్యుత్‌, ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం తదితర స్కీం వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర నిర్మాణాల కార్మికులు, ఆటో కార్మికులు సైతం తడు స్తూనే పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద సభ నిర్వహించిన సభలో ఉమామహేశ్వరరావు మాట్లా డుతూ మోదీ ప్రభుత్వం నవ రత్నాలైన ఇన్సూరెన్సు, బ్యాం కులు, రైల్వే, బొగ్గు, రక్షణ తదితర ప్రభుత్వ సంస్థలను అంబా నీ, అదానీలకు కట్టబెడుతోందని విమర్శించారు. ఎఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రామారావు మాట్లాడుతూ బీజేపీ కార్మిక చట్టాలను రద్దు చేసి ఉత్పత్తికి కారణమైన కార్మిక వర్గా నికి ద్రోహం చేసిందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకా యల బాబూరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో జరిగిన భారీ ర్యాలీలో ఏఐ టీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్‌ మాట్లాడుతూ కార్మికుల ఉద్యోగ భద్రత, వేతన భద్రత, పని పరిస్థితుల మెరుగుదల కోసం కనీస వేతనం రూ.25 వేలు, కనీస పింఛన్‌ రూ.7 వేలు ఇవ్వాలంటూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 



Updated Date - 2020-11-27T05:34:18+05:30 IST