సమ్మె సక్సెస్‌

ABN , First Publish Date - 2020-11-27T05:03:33+05:30 IST

సార్వత్రిక సమ్మెలో భాగంగా ఇఫ్టూ, సీఐటీయూ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్‌, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం అయింది.

సమ్మె సక్సెస్‌
బుట్టాయగూడెం బస్టాండ్‌ సెంటరులో కార్మికుల ఆందోళన

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతం అయింది. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వామపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ర్యాలీలు, మానవహారం చేపట్టారు. 

బుట్టాయగూడెం, నవంబరు 26 : సార్వత్రిక సమ్మెలో భాగంగా ఇఫ్టూ, సీఐటీయూ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్‌, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం అయింది. సమ్మె కారణంగా అన్ని కార్యాలయాలు, దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. ఈ సందర్భంగా బస్టాండ్‌ సెంటరులో జరిగిన సభలో నాయకులు కె.రాఘవ, ఎం.నాగమణి, టి.బాబూరావు, టి.రామకృష్ణ మాట్లాడుతూ చట్టాలపై ప్రతిఘటన పోరా టాల కు సిద్ధంగా ఉండాలన్నారు. ముందుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కార్యక్రమంలో రామలక్ష్మి, సీతామహాలక్ష్మి, శాంతకుమారి, నూర్జహాన్‌ గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:03:33+05:30 IST