ఇది సమోసానే.. కానీ, అది ఆకాశ వీధిలో చక్కర్లు కొడుతోంది. బ్రిటన్‌లోని ‘చాయ్‌వాలా’ రెస్టారెంట్ అధిపతి,భారతీయుడు నీరజ్ గాధెర్.. సమోసాను హీలియం బెలూన్లతో అంతరిక్షంలోకి పంపే ప్రయత్నం చేశారు. అది గగన మార్గాన పయనిస్తూ 600 కిలోమీటర్ల దూరంలోని ఫ్రాన్స్ దేశంలో పడింది.