కార్యదర్శులకు సూచనలు ఇస్తున్న ఎంపీడీవో సునీత
విజయవాడ రూరల్, మార్చి 26 : మండలంలోని అన్ని సంపద కేంద్రాల్లో సేంద్రియ ఎరువుల తయారీ తప్పనిసరని, అన్ని గ్రామాల్లోని సంపద సృష్టి కేంద్రాలను పూర్తిస్థాయిలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విజయవాడ రూరల్ ఎంపీడీవో జె సునీత పంచా యతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం కార్యదర్శులకు సునీత సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ, క్లాప్ మిత్రాల ద్వారా ఇంటింటి నుంచి సేకరించిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయా న్ని, ఇంటింటి నుంచి చెత్త సేకరణకు వసూలు చేసిన యూజర్ చార్జీల మొత్తాన్ని కూడా పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై గ్రామ వలంటీర్లతో సమావేశాలు నిర్వహించాలని, వలంటీర్లపై లైంగిక వేధింపులకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని, ఇందుకోసం వలంటీర్లు క్రమశిక్షణగా మెలుగుతూ విధులు నిర్వహించేలా చూడాలని చెప్పారు. ప్రతి రోజూ వలంటీర్లు విధిగా సచివాలయానికి వచ్చేలా చూడాల న్నారు. అన్ని పంచాయతీలలో ఈ నెలాఖరుకల్లా పూర్తిస్థాయిలో ఇళ్ల పన్ను వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఎప్పటికపుడు వసూళ్ల వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈవోఆర్డీ శేషగిరిరావు, కార్యదర్శులు పాల్గొన్నారు.