Ghaziabad బాలికకు monkeypox ?

ABN , First Publish Date - 2022-06-04T16:55:22+05:30 IST

ఘజియాబాద్ నగరంలో ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్ (monkeypox) వైరస్ సోకిందని అనుమానంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు....

Ghaziabad బాలికకు monkeypox ?

అనుమానంతో పరీక్ష కోసం నమూనాల సేకరణ 

ఘజియాబాద్ : ఘజియాబాద్ నగరంలో ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్ (monkeypox) వైరస్ సోకిందని అనుమానంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.బాలికకు మంకీపాక్స్ సోకిందనే అనుమానంతో తాము పరీక్ష కోసం నమూనాలను సేకరించినట్లు ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శనివారం చెప్పారు. మంకీపాక్స్ సాధారణంగా ఫ్లూ లాంటి అనారోగ్యం, శోషరస కణుపుల వాపుతో ప్రారంభమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. తర్వాత ముఖం, శరీరంపై దద్దుర్లు వస్తాయని వైద్యులు చెప్పారు.బాలికకు ఇతర ఆరోగ్య సమస్యలు లేవని, బాలిక లేదా ఆమె సన్నిహితులు ఎవరూ విదేశాలకు వెళ్లలేదని వైద్యులు పేర్కొన్నారు. మంకీపాక్స్ వ్యాధి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాపించింది.ఘజియాబాద్ బాలికకు మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. 


Updated Date - 2022-06-04T16:55:22+05:30 IST