26, 27 తేదీల్లో రాజమహేంద్రవరంలో.. జాతీయ సాంస్కృతిక మహోత్సవం

Published: Thu, 24 Mar 2022 01:35:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon

రాజమమహేంద్రవరం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : భారతీయ సంస్కృతిని ప్రజలకు అందించడం కోసం,   ఏడు జోన్ల భారత సంస్కృతి మూలాలను బలోపేతం చేసి.. మిశ్రమ సంస్కృతి అభివృద్ధిని సుసంపన్నం చేయడం కోసం  కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ జాతీయ సాంస్కృతిక మహోత్సవాన్ని తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా సాంస్కతిక నగరం రాజమహేంద్రవరంలో నిర్వహిస్తోందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు.  ఈ మహోత్సవం కోసం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండులో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, జేసీ ఎ.భార్గవ్‌తేజ, సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం.అభిషిక్త కిశోర్‌, సౌత్‌సోన్‌ సంచాలకుడు దీపక్‌ కైరువాడ్కర్‌, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ వెంకట్‌, తహశీల్దార్‌ వి.సుస్వాగతంలతో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దక్షిణ ప్రాంత జోన్‌కు చెందిన తంజావూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కళాకారుల ప్రదర్శ నకు, వీక్షించేవారికి అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లుచేయాలని ఆయన ఆదేశించారు. ఈ మహోత్సవా న్ని ప్రారంభించడానికి వస్తున్న రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పర్యటనకు రూట్‌ మ్యాప్‌ సహా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన అర్బన్‌ ఎస్పీకి సూచించారు. రెండ్రోజులపాటు కళా ప్రదర్శనలు. జానపద నృత్య ప్రదర్శనలు, ప్రముఖ గాయకులకు స్వరనివాళి ఉంటుందన్నారు. ప్రతిష్టాత్మకమైన ఏక్‌భారత్‌- శ్రేష్ఠ భారత్‌ లక్ష్యాన్ని పటిష్టంచేస్తూ ఒక రాష్ట్రంతో మరో రాష్ర్టానికి చెందిన సంస్కృతి, కళలు, వంటకాలు, క్రాప్ట్‌, క్విజ్‌లను ప్రదర్శించడంలో ఇది కీలకంగా నిలుస్తుందన్నారు. అదే సమయంలో జానపద, గిరిజన కళలు, నృత్యం, సం గీత ప్రదర్శనలు, వంటకాల ప్రదర్శనతోపాటు కళాకారుల జీవనోపాధికి తోడ్పడానికి సమర్థమైన వేదికను అం దివ్వనుందన్నారు. ప్రతిభావంతులైన కళాకారులకు అవార్డులు ఇస్తూ, ఆయా రంగాలను పునర్జీవింపజేయ డానికి ఈ మహోత్సవం ఉపయోగపడుతుందని చెప్పారు. సుమారు 1000 మంది కళాకారులు, పాక శాస్త్ర నిపుణులు తమ నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శిస్తారని వివరించారు. జనసమీకరణ కోసం ముందుగా రాజమ హేంద్రవరం, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించాలని కోరారు. ఇక్కడ ఫుడ్‌ కోర్టు విభాగాన్ని పర్యాటక రంగ అధికారులు పర్యవేక్షించాలన్నారు. 15 ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని, అందులో బేంబూ చికెన్‌, తాపేశ్వరం కాజా వంటి వారికి కూడా చోటు కల్పించనున్నట్టు తెలి పారు. ఒక్కో జోన్‌  నుంచి ఒక్కో ప్రత్యేక వంటకం తయారీకి ఏడు జోన్లకు కేటాయించినట్టు తెలిపారు. 70 సాంస్కృతిక స్టాల్స్‌ను ఏడు జోన్లకు కేటాయించి, స్థానిక కళాకారుల కోసం 30 స్టాల్స్‌ కేటాయించినట్టు చెప్పారు. గవర్నర్‌ రాకకోసం హెలిప్యాడ్‌ ఏర్పాట్లను సమీక్షించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.