Samsung Galaxy M52 5G: ఇండియాలో లాంచ్ డేట్ వచ్చేసింది!

Published: Mon, 20 Sep 2021 18:36:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Samsung Galaxy M52 5G: ఇండియాలో లాంచ్ డేట్ వచ్చేసింది!

న్యూఢిల్లీ: శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నయా 5జీ స్మార్ట్‌ఫోన్ ‘శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ’ లాంచ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 28న భారత్‌లో విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ ఫోన్ ఈ నెల 19నే విడుదలవుతుందని అమెజాన్ గతవారం పేర్కొంది. అయితే, అది తప్పని తాజాగా తేలిపోయింది. తాజాగా సరికొత్త తేదీని ప్రకటించింది. మరోవైపు శాంసంగ్ కూడా సోషల్ మీడియా ద్వారా లాంచింగ్ డేట్‌ను వెల్లడించింది. గతేడాది వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎం51కి సక్సెసర్‌గా దీనిని తీసుకొచ్చింది. 


సెప్టెంబరు 28న మధ్యాహ్నం 12 గంటలకు శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీని విడుదలవుతున్నట్టు ఫోన్ ఇమేజ్‌తో అమెజాన్ టీజ్ చేసింది. లాంచింగ్ వెంటనే అమెజాన్‌తోపాటు శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో ఇది లభ్యమవుతుంది. గెలాక్సీ ఎం52 5జీ ధర ఇండియాలో ఎంత ఉంటుందన్న వివరాలు తెలియరాలేదు. అయితే, 8జీబీ+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు 32,900 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 


శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్పెసిఫికేషన్లు: ట్రిపుల్ రియర్ కెమెరా, హోల్‌పంచ్ డిస్‌ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గతేడాది వచ్చిన గెలాక్సీ ఎం51 కంటే మరింత పలుచగా (7.4 ఎంఎం) ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-ఒ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ ఎస్ఎం7325 (స్నాప్‌డ్రాగన్ 778జి) ఎస్ఓసీ, 8 జీబీ ర్యామ్, 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా,  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.