అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్..

ABN , First Publish Date - 2021-01-06T01:43:50+05:30 IST

అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్..

అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 14వ తేదీన జరగనున్న ఓ కార్యక్రమంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్‌ను ఆవిష్కరించనున్నట్లు సంస్థ పేర్కొంది.


కొత్త మోడల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ ఆపిల్ మరియు చైనీస్ బ్రాండ్ల నుంచి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోంది.

Updated Date - 2021-01-06T01:43:50+05:30 IST