టీటీడీ మెంబర్‌గా సాముల రామిరెడ్డి

Sep 17 2021 @ 00:56AM
సాముల రామిరెడ్డి

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 16: సూర్యాపేట జిల్లా  హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియామకమయ్యారు. పాలకమండలి సభ్యు డిగా రామిరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి  రామిరెడ్డి అత్యంత సన్నిహితుడు.  వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు భవనానికి రూ.4.5 కోట్లు మంజూరు చేయించారు. వైఎస్‌ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న రామిరెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరుగాంచారు. దీంతో రామిరెడ్డిని అత్యంత కీలకమైన  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ  కృతజ్ఞతలు తెలిపారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి సేవచేసే భాగ్యం లభించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. తెలంగాణ  ప్రాంత అభి వృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు.Follow Us on: