‘రైటర్‌’గా సముద్రఖని

Jun 11 2021 @ 13:32PM

కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్రానికి డైరెక్ట్‌ చేసిన అతికొద్దిమంది దర్శకుల్లో యువ దర్శకుడు పా.రంజిత్‌ ఒకరు. ఈయన వద్ద అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేసిన ఫ్రాంక్లిన్‌ జాకబ్‌ స్వయంగా సిద్ధం చేసిన కథ ‘రైటర్‌’. ఈ కథ ఏ విధంగా తెరకెక్కిందనే విషయాన్ని జాకబ్‌ తాజాగా వివరించారు. ‘‘ఈ చిత్ర కథను అనేక మంది నిర్మాతలకు వినిపించాను. కానీ ఏ ఒక్కరూ ఆ  కథతో సినిమా తీసేందుకు ముందుకురాలేదు. పైగా, భారీ యాక్షన్‌ సన్నివేశాలు, వీరోచిత పోరాట సన్నివేశాలు, రోమాలు నిక్కబొడుచుకునేలా ఛేజింగ్‌ సన్నివేశాలతో కూడిన కథలతో రావాలని కోరారు. వారి మాటలు తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. 

ఈ క్రమంలో ఓ రోజు రంజిత్‌ అన్న నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో ఆయన వద్దకు వెళితే.. చేతిలో ఎన్ని కథలు ఉన్నాయని అడుగగా, మూడు కథలున్నాయని చెప్పారు. వాటిని చదివి, అందులోని ‘రైటర్‌’ చిత్ర కథను ఎంపిక చేశారు. ఈ చిత్ర కథకు హీరోగా సముద్రఖని సార్‌ సరిగ్గా సరిపోతారని చెప్పారు. ఆ వెంటనే సముద్ర ఖనిని కలిసి కథ వినిపించగా, ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. అలా ‘రైటర్‌’ కథ దృశ్యరూపం దాల్సిందన్నారు. ఒక పోలీస్‌ స్టేషనులో ‘రైటర్‌’గా పనిచేసే సముద్రఖని తన పాత్రలో జీవించారు. స్టేషనులో ‘రైటర్‌’గా పనిచేసే వ్యక్తి... అధికార బలగానికి మధ్యతరగతి ప్రజలకు మధ్య జరిగే పోరాటంలో ఏ విధంగా తన విధులను నిర్వహిస్తూ, ప్రజలకు మేలు చేశా రన్నదే ఈ చిత్ర కథ. ముఖంగా, పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని ఈ చిత్రం తగ్గిస్తుందన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసేవారు కూడా మనలాంటి సగటు మనుషులే అనే భావన ప్రజల్లో ఈ చిత్రం కలిగిస్తుందన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.