సంచారి విజయ్‌ ఇకలేరు

Jun 15 2021 @ 05:59AM

కన్నడ కథానాయకుడు, ‘నాను అవనాల్ల... అవలు’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న సంచారి విజయ్‌(38) ఇక లేరు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందున్న సంగతి తెలిసిందే. బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సంచారి విజయ్‌ మరణించినట్టు అపోలో వైద్యులతో పాటు ఆయన సోదరుడు సిద్ధేశ్‌ ధృవీకరించారు. సంచారి విజయ్‌ ఆర్గాన్స్‌ను డొనేట్‌ చేస్తున్నట్టు సిద్ధేశ్‌ తెలిపారు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు సంచారి విజయ్‌ను కొన్నిసార్లు కలిశా. అతని నెక్ట్స్‌ సినిమా కోసం ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నా. ఇంతలో సంచారి విజయ్‌ ఇక లేరనే వార్త తెలిసింది. దీన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉంది. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’’ అని కిచ్చా సుదీప్‌ ట్వీట్‌ చేశారు. పునీత్‌ రాజ్‌కుమార్‌, రక్షిత్‌ శెట్టి, ధనుంజయ, ప్రణీతా సుభాష్‌ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించిన సంచారి విజయ్‌, తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రాలుగా రూపొందిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’, ‘ఉలవచారు బిర్యానీ’లో కీలక పాత్రల్లో కనిపించారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.