విజయం కోసం ఎదురు చూస్తోంది

Jun 15 2021 @ 18:01PM

కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ‘సూధుకవ్వుం’ అనే చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్‌ సంచితా శెట్టి. ఈ మూవీ తర్వాత ‘పిజ్జా-2’, ‘ఎన్నోడు విలైయాడు’, ‘రమ్‌’, ‘ఎంగిట్ట మోదాదే’ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె చివరగా గత మూడేళ్ళ కిత్రం జానీ అనే మూవీలో నటించింది. ఆ తర్వాత ఆమె నటించిన ఏ ఒక్క చిత్రం ప్రేక్షకుల ముందుకురాలేదు. అయినప్పటికీ ఆమె చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఒకటి పూర్తి హాస్యభరితమైన మూవీ. ఈ మూవీలో అట్టకత్తి దినేష్‌ హీరోగా నటిస్తుంటే యూట్యూబ్‌ ఫేం విజయ్‌ వరదరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ‘పార్టీ’ చిత్రం. ఈ రెండు చిత్రాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


ఇవేకాకుండా ‘బహీరా’, ‘దేవదాస్‌ బ్రదర్స్‌’, ‘అళగియ కణ్ణే’ వంటి చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. చేతిలో ఐదు చిత్రాలు ఉన్నప్పటికీ ఆ చిత్రాల విడుదల, విజయం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఫొటోషూట్‌ చేసి ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. చీరకట్టు - ఎరుపు రంగు జాకెట్‌తో ఈ ఫొటోషూట్‌లో కనిపించింది. ఈ ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ అమితంగా లైక్‌ చేస్తున్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.