మంజీరాలో ఇసుక జాతర

ABN , First Publish Date - 2020-09-05T06:50:23+05:30 IST

జిల్లాలోని మంజీర నదిలో ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. టీఎస్‌ ఎండీసీ పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరపడమే

మంజీరాలో ఇసుక జాతర

మంజీరాలో ప్రారంభమైన ఇసుక తవ్వకాలు

ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చిన టీఎస్‌ఎండీసీ 

31.56 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతి

ఇందులో 10లక్షల క్యూబిక్‌ మీటర్లు ప్రభుత్వ పనులకు కేటాయింపు

మిగతా 21.56 లక్షల క్యూబిక్‌ మీటర్లు ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌లకు కేటాయింపు

మంజీరలో ఇసుక తవ్వకాల కోసం ఆరు రీచ్‌ల కేటాయింపు

ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే టీఎస్‌ఎండీసీ వే బిల్లులు మంజూరు

మంజీర నుంచి ఇసుకను తరలిస్తున్న కాంట్రాక్టర్‌లు

అధికారుల పర్యవేక్షణ లేకపోతే ఇసుక పక్కదారి పట్టే అవకాశం


కామారెడ్డి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మంజీర నదిలో ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. టీఎస్‌ ఎండీసీ పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరపడమే కాకుండా కాంట్రాక్ట ర్‌లు ఇసుకను తరలించేస్తున్నారు. దీంతో మంజీర నదిలో ఇసు క లారీల జాతర నెలకొంటుంది. మంజీర నదిలో ఇసుక తవ్వ కాల కోసం భూగర్భగనుల, భూగర్భ జలాల, నీటి పారుదల, రెవెన్యూ శాఖలు సర్వే చేసి రీచ్‌లను గుర్తించారు. అదేవిధంగా నదిపై చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేయడం తో ఇసుకను తోడేందుకు అధికారులు ఇసుక తవ్వకాలకు అను మతులు ఇచ్చారు. టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో మంజీరలో 31.56 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు ఆన్‌లైన్‌లో టెండర్‌ వేశారు.


ఈ ఇసుక తవ్వకాలకు ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌లు టెండర్ల ను దక్కించుకున్నారు. ఇసుకను తరలించేందుకు కాంట్రాక్టర్‌లు మంజీర నదిలో ర్యాంపులు, రహదారులు ఏర్పాటు చేసు కున్నారు. నాలుగు రోజుల నుంచి మంజీరలో ఇసుక తవ్వకాలు జరుపుతూ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి టీఎస్‌ఎం డీసీ వే బిల్లులు మంజూరు చేస్తు ఇసుకను తరలించేస్తు న్నారు. మరోవైపు మంజీరలో ఇసుక మొత్త ం తోడెయ్యడంతో స్థానిక గ్రామస్థుల్లో ఆందోళన నెలకొం ది. ఎక్కడ భూ గర్భజలాలు పడిపోతాయేనని ఆయా శాఖల అధికారులకు గ్రామాల వారు ఫిర్యాదులు చేస్తు న్నారు.


మంజీరలో 32.81 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు అనుమతులు

జిల్లాలోని మంజీర నదిపై బీర్కూర్‌ మండల పరిధిలో ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మాణం చేపడుతోంది. అయితే చెక్‌ డ్యాం నిర్మించి పైభాగంలోని మంజీర నదిలో ఉన్న ఇసు కను తోడెయ్యాలని నీటి పారుదల శాఖ అధికారుల నివే దికతో బీర్కూర్‌ మండలంలోని బీర్కూర్‌ గ్రామం, బిచ్కు ందలోని కడ్గం గ్రామపరిధిలో, మద్నూర్‌లోని కూర్ల పంచాయతీ పరిధిలో ఉన్న మంజీర నదిలో ఇసుక రీచ్‌ల ను గుర్తించారు. వీటి వద్ద 31లక్షల 56వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు టీఎస్‌ఎండీసీ ద్వారా తవ్వకాలు జర పాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు బా న్సువాడ, పిట్లం, బిచ్కుంద మండల పరిధిలోని మంజీర నదిలో 1లక్ష 25వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు రెవెన్యూ అధికారులు స్థానిక అవసరాలకు, ప్రభుత్వ పనులకు అనుమతులు ఇచ్చారు.


ఆరు ఇసుక పాయింట్లుగా ఏర్పాటు

బీర్కూర్‌, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల మీదుగా ప్రవహించే మంజీర నదిలో 31.56 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలపై టీఎస్‌ఎండీసీ అనుమతిచ్చిన విష యం తెలిసిందే. ఇందులో 21.56 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌లకు అప్పగించారు. మిగతా 10లక్షల క్యూబిక్‌ మీటర్లు ప్రభుత్వ పనుల కు కేటాయించారు. మంజీర నదిలోని ఇసుక రీచ్‌లను 6 పాయింట్లుగా విభజించారు. బీర్కూర్‌ నది ఒడ్డుకు ఇటువైపున 3 పాయింట్లు, బిచ్కు ందలోని నది ఒడ్డుకు అటువైపున మూడు పాయింట్లను ఏర్పాటు చేశారు.


ఒకటి, నాలుగు, ఆరు పాయింట్లు బీర్కూర్‌ మండల పరిధిలో ఉండగా రెండో పాయింట్‌ మద్నూర్‌ మండలం కూర్లా గ్రామపరిధిలో ఉంది. మూడు, ఐదు ఇసుక పాయింట్లు బిచ్కుంద మండలం ఖడ్గవ్‌ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి బిచ్కుందలోని కడ్గవ్‌ మూడు, ఐదు పాయింట్ల వద్ద టీఎస్‌ఎండీసీ టెంపర్‌వరి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించారు.  కరీంనగర్‌, కామారెడ్డి ప్రాంతాలకు చెంది న ఇద్దరు కాంట్రాక్టర్‌లు ఈ ఇసుక రీచ్‌లలో తవ్వకాలు చేపట్టనున్నారు. ఈ ఇసుకను తరలించేందుకు సంబంధి త కాంట్రాక్టర్లు ఇసుకరీచ్‌ల వద్ద టిప్పర్‌లు, లారీలు, ట్రాక్టర్‌లు ఇసుకను తీసుకెళ్లేందుకు అనుకూలంగా రహ దారులను, ర్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నారు.


కాంట్రాక్టర్‌లు నిబంధనలు పాటించేనా?

జిల్లాలోని మంజీర నది లో గతంలోనూ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వా లు అనుమతి ఇచ్చే వి. టెండర్లు వేసి ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌లకు తవ్వకాలు చేపట్టే వారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కొందరు అధికారులకు కాంట్రాక్టర్ల కాసులుఆశచూపి ఇసుకను అక్రమంగా తరలించేవారు. తవ్వకాలకు అనుమతి ఒకచోట ఉంటే మరోచోట  తవ్వ కాలు జరిపేవారు. లారీలు టిప్పర్‌లలో పరిమితికి మించి లోడ్‌ చేయడం, ఎలాంటి వేబిల్లులు లేకుండా రాత్రులకు రాత్రులే అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఇసుకాసురులు కోట్లు గడించిన ఘటనలు ఉన్నాయి.


మంజీర నదిలో మళ్లీ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో అధికా రుల నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే. ఇసుక తవ్వకాలు జరిపే రీచ్‌ల వద్ద ప్రత్యేక వే బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాల నిఘాలో తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. లారీలు, టిప్పర్‌ల కెపాసిటీని బట్టి ఇసుక లోడ్‌ చేయాల్సి ఉంటుంది. రీచ్‌ల వద్ద రెండు మీటర్ల లోతులో కంటే ఎక్కువ ఇసుక తవ్వకాలు జరపవద్దనే నిబంధన ఉంది. కానీ ప్రస్తుతం ఐదు, మూడు ఇసుకపాయింట్ల తవ్వకాలు ప్రారంభమైనందున స్థానిక కాంట్రాక్టర్‌లు 2 మీటర్ల పైగానే ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.


అనుమతి మేరకే తవ్వకాలు..యాదిరెడ్డి, అదనపు కలెక్టర్‌

జిల్లాలోని మంజీర నది లో ప్రభుత్వ అనుమతుల మేరకే ఇసుక తవ్వకాలు చేపట్టడం జరుగుతోంది. టీఎస్‌ఎం డీసీ పర్యవేక్షణలో తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇసుక తరలింపు, రీచ్‌లలో తవ్వకాలు మొత్తం టీఎస్‌ఎండీసీ సంస్థ పర్యవేక్షణ చేస్తోంది.


నిబంధనల మేరకే తరలింపు..రామకృష్ణ, పీవో, టీఎస్‌ఎండీసీ

జిల్లాలోని మంజీర నదిలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో ఆన్‌లైన్‌లో 31.56 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు టెండర్‌లు వేశాం. ఇం దులో 10లక్షల క్యూబిక్‌ మీటర్లు ప్రభుత్వ పనులకు కేటాయించ గా మిగతా 21.56లక్షల క్యూబిక్‌ మీటర్లు ప్రైవేట్‌ కాంట్రాక్ట్‌కు కేటాయి ంచాం. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న వారు నిబంధనల మేరకే ఇసుక తవ్వకా లు జరిపి తరలించాల్సి ఉంటుంది. ఆరు రీచ్‌లుగా విభజించి నాలుగు రోజు ల నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. సీసీ కెమెరాల నిఘాలో సిబ్బంది పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

Updated Date - 2020-09-05T06:50:23+05:30 IST