రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది: షర్మిల

ABN , First Publish Date - 2021-10-01T21:18:26+05:30 IST

రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది: షర్మిల

నిజామాబాద్‌: రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిబంధ‌న‌ల‌ను విరుద్ధంగా వాగులు, న‌దుల‌ను తోడేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక‌ గుంత‌ల్లో ప‌డి ప్రజ‌లు చనిపోతుంటే ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదని మండిపడ్డారు. ఒకే కుటుంబంలో న‌లుగురు చ‌నిపోతే సీఎం కేసీఆర్ క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేదని దుయ్యబట్టారు. చిన్నారుల మృతికి కార‌ణ‌మైనవారిపై ఎలాంటి చ‌ర్యలు లేవని షర్మిల తప్పుబట్టారు. జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం షెట్లూర్‌ గ్రామంలో మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.


Updated Date - 2021-10-01T21:18:26+05:30 IST