కోడేరు ర్యాంపులో క్యూకట్టిన లారీలు
జగనన్న ఇళ్ల పేరు... బొండు ఇసుక తరలింపు
ఆచంట, మార్చి 27 : ప్రభుత్వం అవకాశమి చ్చింది..అక్రమాలకు బాటలు వేసేశారు.. అయిన కాడికి తవ్వేస్తున్నారు.. తరలించేస్తు న్నారు.ఆచంట నియోజకవర్గంలో సిద్ధాంతం,నడిపూడి,కోడేరు,కరుగోరుమిల్లి ఇసుక ర్యాంప్‌లు జేపీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నియోజకవర్గంలో జగనన్నకాలనీల పూడికకు బేస్మెంట్ వేసుకోవడానికి ర్యాంపుల నుంచి బొండు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే సదుపాయం లబ్ధిదారులకు కల్పించారు.నియోజకవర్గ జగనన్న కాలనీల్లో 10,953 ఇల్లు మంజూరు కాగా సుమారు 1050 ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. వీటికి మాత్రమే బొండు ఇసుక (బొండు మట్టి) అవసరం.ఇదే అదును గా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జగనన్న కాలనీల పేరుతో గత కొన్ని రోజులుగా వందలాది వాహనాలు బొండు ఇసుకను తరలిం చుకుపోతున్నాయి.కొన్ని వాహనాలకు ఫ్లెక్సీలు కూడా పెట్టి సరఫరా చేస్తున్నారు.ఇటీవల సిద్ధాంతం ర్యాంప్ నుంచి జగనన్న కాలనీల పేరుతో బొండు ఇసుకను ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారంటూ ఫిర్యాదు అందడంతో రెవెన్యూ అధికారులు పట్టు కున్నారు. ర్యాంపుల్లో బొండు మట్టి(ఇసుక)కే గిరాకీ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ర్యాంపుల్లో బొండు ఇసుక వాహనాలు నిండి ఉంటున్నాయి.నాయకుల కనుసన్నల్లో తరలిపోతు న్నాయి. అయినా అధికారులు మాత్రం కన్నెత్తిచూడడంలేదు.
=