యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2020-10-03T09:56:52+05:30 IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌లోని జుక్కల్‌ నియోజకవర్గంలో ఇసుక మా ఫియా రోజురోజుకూ పేట్రేగిపోతోంది.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో దర్జాగా ఇసుక దందా

రాత్రివేళల్లో డంపుల నుంచి అక్రమ రవాణా 

ఒక్కో ట్రాక్టర్‌ ఇసుక రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు విక్రయం 

వర్షాకాలం ఇసుక కొరతతో సొమ్ముచేసుకుంటున్న మాఫియా

హైదరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్రకు తరలింపు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

ఇకనైనా తెరవెనక ‘పాత్రదారులపై’  చర్యలు తీసుకునేనా?


బాన్సువాడ, అక్టోబరు 2 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌లోని జుక్కల్‌ నియోజకవర్గంలో ఇసుక మా ఫియా రోజురోజుకూ పేట్రేగిపోతోంది. వ ర్షాకాలానికి ముందే మంజీరా నదితో పాటు ఇ తర ప్రదేశాల నుంచి డంపు చేసిన ఇసుకను ప్ర స్తుతం రాత్రి వేళల్లో అక్రమంగా రవాణా చేస్తూ ప క్కాగా ప్రణాళికలు రూపొందించి, దర్జాగా దందాను సాగిస్తున్నారు. వర్షాకాలం సీజన్‌ కావడంతో మంజీరా ప రీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించేందుకు వీ లు లేకపోవడంతో అంతకు ముందే ఆయా మండల కేంద్రాల్లో ఇసుక డంపులు నిల్వ చేసుకుని ఒక్కొ క్క ట్రాక్టర్‌కు రూ.3500 నుంచి రూ. 4 వేల వరకు అధిక ధరకు విక్రయిస్తూ దందా ను మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తు న్నారు.


ఇదంతా తెలిసినా అధికార యంత్రాంగం మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆ రోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గత నాలుగై దు రోజుల క్రితం జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం పుల్కల్‌, జుక్కల్‌ మండలంలోని పెద్ద ఎడ్గి ప్రాం తాల నుంచి సాక్షాత్తు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లోనే అక్ర మంగా ఇసుక తరలిస్తూ పట్టుబడిన సంఘటనలున్నాయి. ఎ న్నో రోజులుగా అక్రమార్కులు దర్జాగా రేయింబవళ్లు ఇసుక ను ట్రాక్టర్లలో లోడ్‌ చేసుకుని జుక్కల్‌ నియోకజవర్గంలోని పి ట్లం, మద్నూర్‌, జుక్కల్‌ మండల కేంద్రాల మీదుగా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు త రలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పి దందాను ఇష్టారాజ్యంగా చే సుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదిలా ఉండ గా, బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌, కిష్టాపూర్‌, బ రంగ్‌ఎడ్గి ప్రాంతాల నుంచి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పేరిట అ నుమతులు తీసుకుని ప్రైవేట్‌ వ్యక్తులకు అధిక ధరకు విక్ర యిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


బాన్సువాడ పట్టణంలో డ బుల్‌ బెడ్‌ రూంలకు అవసరమైన ఇసుకను బీర్కూర్‌, కిష్టా పూర్‌, మంజీరా పరీవాహక ప్రాంతాల నుంచి అనుమతులు పొంది తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇసుకాసురులు దీనినే ఆసరాగా చేసుకుని ఇసుకను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు ఇసుక మాఫియాకు కల్ప తరవుగా మారాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికా రులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒక సాధారణ వ్యక్తి తన ఇంటిని నిర్మించుకునేందుకు ఇసుక అనుమతుల ను కోరితే వారి దరఖాస్తులను పక్కన పెట్టి మరీ అధికారు లు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో అక్ర మ దందాకు తెరలేచింది. 


రాత్రివేళల్లో దర్జాగా ఇసుక అక్రమ దందా 

బాన్సువాడ డివిజన్‌లోని జుక్కల్‌ నియోజకవర్గంలోని మంజీరా పరీవాహక ప్రాంతాలైన పుల్కల్‌, బండారెంజల్‌, శె ట్లూర్‌, పెద్ద ఎడ్గి, తదితర ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమ ంగా సరఫరా చేస్తూ దర్జాగా దందాను కొనసాగిస్తున్నారు.  దీ నినే ఆసరాగా చేసుకుని ఇసుకాసురులు తమ ట్రాక్టర్లను మ ంజీరాలోకి తీసుకుని వెళ్లి ఇసుకను లోడ్‌ చేసి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పేరిట వే బిల్లులను పొందుతున్నారు. ఇదిలా ఉం టే జుక్కల్‌ నియోజకవర్గంలోని జాతీయ ప్రధాన రహదారి గుండా రాత్రివేళలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సంఘటనలున్నాయి. పు ల్కల్‌ కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది. ఇసుక మాఫి యాకు తెరవెనుక నుంచి కొంతమంది నేతలు తమ పూర్తి స హాయ, సహకారాలు అందిస్తుండడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారులను సైతం బెదిరించి ఇసుక అ క్రమ వ్యాపారాన్ని దర్జాగా చేసుకుంటున్నారు. 


అక్రమార్కులపై కొరడా ఝుళిపించేనా?

ఇసుకను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్ర మార్కులపై అధికారులు కొరఢా ఝుళిపిస్తారా? లేక చూసీ చూడనట్లు వ్యవహరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం, జుక్కల్‌, పెద్ద కొడప్‌గల్‌, మండలాలకు చెందిన కొం తమంది ట్రాక్టర్‌ యజమానులు ఇసుక మాఫియాగా మారి ఇసుక అక్రమ దందాకు శ్రీకారం చుట్టారు. ప్రతీరోజు అక్ర మంగా ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఒ క్కొక్క వ్యక్తి మూడు, నాలుగు ట్రాక్టర్లను నడుపుతూ ప్రతిరో జు 10 నుంచి 20 వేల రూపాయల వరకు సంపాదించుకుం టున్నారు. ఇప్పటికైనా అక్రమార్కులపై అధికారులు కొరఢా ఝుళిపిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. 

Updated Date - 2020-10-03T09:56:52+05:30 IST