ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-05-27T06:07:18+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ గుగులోతు రవినాయక్‌ ఆదేశిం చారు. గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
వెబ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

- జగిత్యాల కలెక్టర్‌ రవినాయక్‌

జగిత్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ గుగులోతు రవినాయక్‌ ఆదేశిం చారు. గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులకు చెందిన వాహనాలు సీజ్‌ చేసి పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. సీజ్‌ చేసిన ఇసుకను ప్రభుత్వ నిర్మాణ పనులకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండ లాల వారీగా లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ పనులను తహసీల్దార్లు పర్యవేక్షిం చాలన్నారు. మండలాల్లో రైస్‌ మిల్లర్ల వారీగా పెండింగ్‌ ఉన్న సీఎంఆర్‌ రైస్‌ డెలివరీ వివరాలు తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటరు జాబితాలో ఒకే ఓటరు ఫోటోలు, పేర్లు వంటి వివరాలు డబుల్‌ ఎంట్రీ లను పరిశీలించి తొలగించాలన్నారు. ఈ ఆఫీస్‌ ద్వారా ఫైళ్లు పెండింగ్‌ లేకుండా త్వరగా పరిష్కరించాలన్నారు. పెండింగ్‌ మ్యూటేషన్లు, చెక్‌ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయాలని ఆదే శించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, మీ సేవా పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులను నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు పంపిణీ చేయాలన్నారు. ఇతరులు పంపిణీ చేయకుండా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతీ పిటిషన్లపై సత్వరమే చర్యలు తీసుకోవా లన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, జిల్లా స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, జగిత్యాల ఆర్డీఓ మాదురి, ఆయా మండలాల తహసీల్ధార్లు, కలెక్టరేట్‌ కార్యాలయ ఏఓ, సూపరెండెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:07:18+05:30 IST