ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2022-10-04T05:14:40+05:30 IST

మండలంలో ఇసుక రీచ్‌లు లేకుండానే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని అడ్డుకోవాలని టీడీపీ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ మునిరత్నం డిమాండ్‌ చేశారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి
నిమ్మనపల్లె బస్టాండులో ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ నేతలు

నిమ్మనపల్లె, అక్టోబరు 3: మండలంలో ఇసుక రీచ్‌లు లేకుండానే  ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న  వారిని అడ్డుకోవాలని  టీడీపీ  క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ మునిరత్నం డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక బస్టాండులో ఇసు క అక్రమ రవాణాను ఆపాలంటూ టీడీపీ నేతలు ధర్నా చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ అధికా రులు రీచ్‌లు లేకుండా బాహుదా కాలు వలలో ఇసుకను తోలేందుకు అనుమతు లు ఇస్తున్నారని ఇందులో  కేవలం వైసీపీ నేతలు వెళితేనే అనుమతులు ఇస్తూ మిగిలిన వారిని పక్కన పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో ట్రాక్టర్‌ లోడు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు అమ్ముకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్ర మంలో నాయకులు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్‌, లక్ష్మన్న, చినబాబు, చంద్ర, సూర్య ప్రకాశ్‌, విజయ్‌, గోపి, వెంకటరమణ శ్రీనివాసులు భూపతి చెన్నరాయుడు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-04T05:14:40+05:30 IST