కొలిగాం రీచలో అలజడి

ABN , First Publish Date - 2020-11-29T04:53:42+05:30 IST

ఇచ్ఛాపురం మండలంలోని బాహుదానది పరీవాహక ప్రాంతంలోని కొలిగాం ఇసుక రీచ్‌ కొంతమంది నాయకులకు బంగారు బాతులా మారింది. ఈ రీచ నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పగటిపూట ఎటువంటి అనుమతులు లేకుండానే ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్‌ జరుగుతోంది. ఒకవేళ అధికారులు తనిఖీలు చేస్తేనే.. సచివాలయాలకు వెళ్లి ఇసుక రవాణా కోసం అనుమతులు తెస్తున్నారు. లేకుంటే అక్రమంగానే రవాణా సాగిస్తున్నారు.

కొలిగాం రీచలో అలజడి
కొలిగాం రీచ్‌ నుంచి ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్న దృశ్యం





ఇసుక అక్రమ తవ్వకాలపై పోలీసుల పరిశీలన

అనుమతుల కోసం అక్రమార్కుల పరుగులు

(ఇచ్ఛాపురం రూరల్‌) 

ఇచ్ఛాపురం మండలంలోని బాహుదానది పరీవాహక ప్రాంతంలోని కొలిగాం ఇసుక రీచ్‌ కొంతమంది నాయకులకు బంగారు బాతులా మారింది. ఈ రీచ నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పగటిపూట ఎటువంటి అనుమతులు లేకుండానే ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్‌ జరుగుతోంది. ఒకవేళ అధికారులు తనిఖీలు చేస్తేనే.. సచివాలయాలకు వెళ్లి ఇసుక రవాణా కోసం అనుమతులు తెస్తున్నారు. లేకుంటే అక్రమంగానే రవాణా సాగిస్తున్నారు. శనివారం కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. కొలిగాం ఇసుక రీచ్‌లో నిత్యం అక్రమాలు జరుగుతున్నాయని డీసీఎంఎస్‌ చైర్మన్‌, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పిరియా సాయిరాజ్‌ గురువారం తహసీల్దార్‌ మురళీ కృష్ణారావుకు, రూరల్‌ ఎస్సై కె.లక్ష్మీలకు ఫిర్యాదు చేశారు. పట్టణ ట్రాక్టర్ల యూనియన్‌ సభ్యులు కూడా పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో రూరల్‌ ఎస్‌ఐ కె.లక్ష్మీ శనివారం ఈ ఇసుక రీచ్‌ను తనిఖీ చేశారు. అప్పటికే 38 ట్రాక్టర్లు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక లోడులతో ఉన్నాయి. ఎస్‌ఐ రావడంతో కొంతమంది యజమానులు, డ్రైవర్లు.. ఇసుక రవాణా అనుమతి కోసం సచివాలయానికి పరుగులు తీశారు. మరికొంత మంది రెండు రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా సర్వర్‌ పనిచేయక అనుమతులు రాలేదని చెప్పుకొచ్చారు. దీంతో సచివాలయ ఉద్యోగులతో ఆమె మాట్లాడారు. రెండు రోజుల నుంచి సర్వర్‌ పనిచేయడం లేదని చెప్పడంతో.. అనుమతులు వచ్చిన తరువాతే ఇసుకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. 

 



Updated Date - 2020-11-29T04:53:42+05:30 IST