శాండల్‌వుడ్‌ నిర్మాత కేసీఎన్‌ చంద్రశేఖర్‌ కన్నుమూత

Jun 15 2021 @ 06:01AM

శాండల్‌వుడ్‌ ప్రముఖ నిర్మాత, డిస్ర్టిబ్యూటర్‌ కేసీఎన్‌ చంద్రశేఖర్‌ (69) కన్నుమూశారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి (కేఎ్‌ఫసీసీ)కి రెండుసార్లు ఛైర్మన్‌గాను, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌  చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎస్‌ఐఎ్‌ఫసీసీ)కు ఒకసారి ఛైర్మన్‌గాను ఆయన వ్యవహరించారు. 1978లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ త్రిపాత్రాభినయంతో విడుదలైన ‘శంకర్‌ గురు’ సినిమాకు నిర్మాతగా ఆయన వ్యవహరించారు. ఆ తర్వాత హులి హాలిన మేవు, భక్త జ్ఞానదేవ, ధర్మయుద్ధ, తాయి, నానొబ్బ కళ్ళ తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. చంద్రశేఖర్‌ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా కొనసాగారు. ఈయన తండ్రి కేసీ నంజుండగౌడ కూడా నిర్మాతే. తండ్రి అడుగుజాడల్లోనే నిర్మాతగా రాణించారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.