ఇసుక బస్తాలోయ్.. ఇసుక బస్తాలు
ABN , First Publish Date - 2022-09-27T07:18:23+05:30 IST
నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి ఈ చిత్రం దర్పణం పడుతోంది. నిర్మాణ పనులకు టర్బో లారీలు, ట్రక్కుల్లో తెచ్చుకొనే ఇసుకను బస్తాల్లో తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి ఈ చిత్రం దర్పణం పడుతోంది. నిర్మాణ పనులకు టర్బో లారీలు, ట్రక్కుల్లో తెచ్చుకొనే ఇసుకను బస్తాల్లో తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది. ఇది ఇసుక దొరకొని ఏ సుదూర ప్రాంతమో కాదు. ఇసుక అక్రమ, సక్రమ రవాణాకు అడ్డాగా ఉండే కడవకుదురుకు సమీపంలోని ఇంకొల్లులో పరిస్థితి ఉంది. ఇసుక గిరాకీ దృష్ట్య ఓ ఔత్సాహికుడు సిమెంట్ బస్తాల్లో ఇసుకను నింపి ఎడ్ల బండిపై ఇంకొల్లు తీసుకొచ్చి ‘ఇసుక బస్తాలే ఇసుక బస్తాలు’ అంటూ విక్రయిస్తున్నాడు. ఈ బస్తాలు కూడా సిమెంట్ బస్తాకు పోటీగా రూ.200కు విక్రయించడం గమనార్హం. చిన్న చిన్న మరమ్మతులు చేసే వారు ఈ ధరకు చెల్లించి అనివార్యంగా కొనుగోలు చేయడం గమనార్హం.
- ఇంకొల్లు