అఖిలగాండ్ల తెలికుల సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడిగా సందీప్‌

ABN , First Publish Date - 2022-05-16T04:19:50+05:30 IST

అఖిలగాండ్ల తెలికుల సంక్షేమసంఘం జిల్లా ఎన్నికలు ఆదివాసీభవన్‌లో ఆదివారం జరి గాయి. ఈసంఘం నుంచి జిల్లాలో మొత్తం 173మంది ఎన్నికల్లో పాల్గొన్నారు.

అఖిలగాండ్ల తెలికుల సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడిగా సందీప్‌
నూతన జిల్లా అధ్యక్షుడిని సన్మానిస్తున్న నాయకులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 15: అఖిలగాండ్ల తెలికుల సంక్షేమసంఘం జిల్లా ఎన్నికలు ఆదివాసీభవన్‌లో ఆదివారం జరి గాయి. ఈసంఘం నుంచి జిల్లాలో మొత్తం 173మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవి బరిలో ఉన్న సందీప్‌కు 105ఓట్లు వచ్చాయి. అనంతరం అఖిలగాండ్ల తెలికుల సంఘం కార్గవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానకార్యదర్శిగా ఆకాష్‌, కోశాధికారిగా కృష్ణ ఎన్నుకున్నారు.

అధ్యక్షుడికి సన్మానం

అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్‌ను ఆదివారం ఏఎంసీచైర్మన్‌ మల్లేష్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సందీప్‌ మాట్లాడుతూ తనపై నమ్మకం పెట్టి గెలిపించిన సభ్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. సంఘ బలోపేతానికి  కృషిచేస్తానన్నారు. నాయకులు రవీందర్‌, ప్రవీణ్‌, నాందేవ్‌, రాజు, దిలీప్‌,సాలం, బండేశంకర్‌, శ్యాం,సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T04:19:50+05:30 IST