‘సంధ్యా’ రాగం

ABN , First Publish Date - 2021-03-24T07:59:58+05:30 IST

భారత ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యేకత సంపాదించుకున్న డిజైనర్‌. ఆయన రూపొందించే ప్రతి డ్రెస్సూ మాస్టర్‌ పీస్‌. ఒకేలా మరొకటి ఉండదు. వినూత్నంగా, రాబోయే ట్రెండ్‌కు వేదికగా ఆయన డిజైన్లు ఆకట్టుకొంటాయి.

‘సంధ్యా’ రాగం

గౌరవ్‌ గుప్తా... భారత ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యేకత సంపాదించుకున్న డిజైనర్‌. ఆయన రూపొందించే ప్రతి డ్రెస్సూ మాస్టర్‌ పీస్‌. ఒకేలా మరొకటి ఉండదు. వినూత్నంగా, రాబోయే ట్రెండ్‌కు వేదికగా ఆయన డిజైన్లు ఆకట్టుకొంటాయి. ఇక్కడ మోడల్స్‌ ధరించింది అలాంటి ఓ ప్రత్యేకమైన కలెక్షనే... ‘ద సెలెస్టియల్‌ సన్‌సెట్‌’! సాయం సంధ్యలో... ఆహ్లాదమైన ప్రకృతి ఒడిలో... దివి నుంచి భువికి దిగివచ్చిన తారల్లా ఈ భామలు మెరుస్తున్నారు. గ్రీకు పురాణగాథలను స్ఫూర్తిగా తీసుకుని దీనికి రూపం ఇచ్చారు గౌరవ్‌. పదహారేళ్లుగా ఫ్యాషన్‌ రంగంలో తన ముద్ర వేసుకున్న ఆయన... ఈ కలెక్షన్‌తో మనల్ని సరికొత్త ఊహాప్రపంచంలోకి తీసుకువెళతారు. సంప్రదాయ సొగసులకు పాశ్చాత్య హంగులద్ది ఇలా రకరకాల అభిరుచులవారిని ఆకర్షించారు. 





Updated Date - 2021-03-24T07:59:58+05:30 IST