Andhra Pradesh: ఏపీలో ప్రతిరోజూ ఏదో ఒక చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని జగన్ ప్రభుత్వం అరికట్టలేకపోతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్యాచారాలు యాదృచ్ఛికంగా జరుగుతాయని బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురై మానసిక వేదనతో బతుకుతున్న బాధితులను మంత్రులు, ముఖ్యమంత్రి మాటలు మరింత గాయపరుస్తున్నాయన్నారు. బాధిత మహిళలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి