సంగారెడ్డి: జిల్లాలోని రాయికోడ్ మండలం హస్నాబాద్ గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పడకంటి వీరేశంగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెందిన వీరేశం ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని చెరువులో నుండి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి