రదుకానుకు షాక్‌

ABN , First Publish Date - 2022-01-21T08:58:57+05:30 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఎమ్మా రదుకాను (బ్రిటన్‌), మూడో సీడ్‌ గార్బినె ముగురుజాకు షాక్‌ తగిలింది.

రదుకానుకు షాక్‌

 ముగురుజా, మర్రే అవుట్‌

 మూడో రౌండ్‌కు సబలెంక, హలెప్‌

 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌


మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఎమ్మా రదుకాను (బ్రిటన్‌), మూడో సీడ్‌ గార్బినె ముగురుజాకు షాక్‌ తగిలింది. రెండో రౌండ్‌లో రదుకాను 4-6, 6-4, 3-6తో డంకా కొవినిచ్‌ (మాంటెనెగ్రిన్‌) చేతిలో, ముగురుజా 3-6, 3-6తో అలిజ్‌ కార్నెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో, కొంటావెట్‌ 2-6, 4-6తో టాసన్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడి ఇంటిముఖం పట్టారు. రెండో సీడ్‌ సబలెంక 1-6, 6-4, 6-2తో వాంగ్‌ జిన్‌యు (చైనా)పై, హలెప్‌ 6-2, 6-0తో హడాడ్‌ (బ్రెజిల్‌)పై,  పావ్‌ల్యుచెన్‌కొవా 6-2, 6-2తో స్టోసర్‌పై, స్వియటెక్‌ 6-2, 6-2తో రెబెక్కాపై, మెర్టిన్స్‌ 6-3, 6-2తో ఇరియానాపై గెలిచి ముందంజ వేశారు. కాగా రష్యాస్టార్‌ మెద్వెదెవ్‌ 7-6(1), 6-4, 4-6, 6-2తో కిరియోస్‌ (ఆస్ట్రేలియా)పై,  సిట్సిపాస్‌ 7-6(1), 6-7(5), 6-3, 6-4తో బేజ్‌పై నెగ్గగా, మర్రే 4-6, 4-6, 4-6తో డేనియల్‌ (జపాన్‌) చేతిలో చిత్తయ్యాడు. 

ప్రీ క్వార్టర్స్‌కు సానియా జోడీ: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా-రాజీవ్‌రామ్‌ (అమెరికా) జోడీ  ప్రీక్వార్టర్స్‌కు చేరింది. తొలి రౌండ్‌లో సానియా జంట 6-3, 7-6తో సెర్బియా జోడీ కరొనిక్‌-కకిక్‌పై నెగ్గింది.

Updated Date - 2022-01-21T08:58:57+05:30 IST