సీజనల్‌ వ్యాధులు రాకుండా పారిశుధ్య పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-06-17T04:39:58+05:30 IST

సీజనల్‌ వ్యాధులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీలో పారిశుధ్యం పక్కాగా నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలెక్టర్‌లకు సూచించారు.

సీజనల్‌ వ్యాధులు రాకుండా పారిశుధ్య పనులు చేపట్టాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అధికారులు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కామారెడ్డి, జూన్‌ 16: సీజనల్‌ వ్యాధులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీలో పారిశుధ్యం పక్కాగా నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలెక్టర్‌లకు సూచించారు. బుఽధవారం వీడియో కాన్ఫరె న్స్‌ ద్వారా మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణకు గ్రామం, మండలం వారీగా కార్యాచర ణ చేపట్టాలని తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్టుషెడ్లకు తరలించాలని తెలిపారు. వైకుంఠ ఽధామాల్లో అన్ని వసతులు కల్పించాలని, కాంపౌండ్‌ వాల్స్‌ తప్పక నిర్వహించాలని, పూల మొక్కలతో పచ్చదనం పెంపొందించాలని తెలిపారు. అన్ని గ్రామసభలు నిర్ధేశించిన సమయంలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పల్లె ప్రగ తి, పట్టణ ప్రగతి నిర్వహణ పట్ల రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం సీఎస్‌ సోమేష్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పట్టణాల్లో శానిటేషన్‌, డ్రింకింగ్‌ వాటర్‌, గ్రీనరీ వంటి ముఖ్య కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అదనపు కలెక్టర్‌లకు నూతన వాహనాలను అందించడం జరిగిందని, ఎమర్జెన్సీ నిధుల కింద రూ.25 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. 20,21తేదీల్లో సీఎం కలెక్టరేట్‌, పోలీసు భవనాలను ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నందున పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్‌ వ్యాధులకు చికి త్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, జిల్లా ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
ఏడో విడత హరితహారంలో ఆయా శాఖలు తమ లక్ష్యాన్ని చేరుకోవాలి
కామారెడ్డి టౌన్‌: ఏడో విడత హరితహారంలో ఆయా శాఖలు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులకు సూచించారు. బుధవారం జనహితభవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే లక్ష్యాలను నిర్ధేశించారు. గత సంవత్సరం 86లక్షల 49వేల మొక్కలు నాటి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచామని, అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా లక్ష్య సాధనకు అంకిత భావంతో పని చేయాలని తెలిపారు. జిల్లాలో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని ముందుగా మొక్కలు నాటే ప్రదేశాలను, ఖాళీ స్థలాలను గుర్తించాలని తెలిపారు. మొక్కలు దెబ్బతిన్నచోట, మొక్కల మధ్య ఎక్కువ గ్యాప్‌ ఉన్న చోట, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని తెలిపారు. డీఆర్‌డీవో ద్వారా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలను అందించాలని తెలిపారు. జిల్లాలోని 7 అవుటర్‌ రోడ్లలో దాదాపు మూడు వందల కిలో మీటర్ల పరిధిలో రోడ్‌సైడ్‌ అవెన్యూ ప్లాంటేషన్‌లో పూర్తిస్థాయిలో మొక్కలు నాటాలని ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాలోని చెరువుకట్టలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలు, కార్యాలయాల వద్ద, బస్‌స్టేషన్‌లలో మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో ఫారెస్ట్‌ అధికారులు ఈనెల 25లోగా అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస ్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, డీఎఫ్‌వో నిఖిత తదితరులు పాల్గొన్నారు.
కాలువల్లో పూడిక తీయించాలి
రోడ్లకు ఇరువైపులా కాలువల్లో ఉన్న పూడిక తీయించి శుభ్రపరచాలని మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని పలు వార్డులను ఆయన పరిశీలించారు. కొత్తగా అర్బన్‌ పార్కు ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. ఇందిరాగాంఽధీ స్టేడియం చుట్టు మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారం, మురికికాలువల్లో ఉన్న పూడికను ఎప్పటికప్పుడు శుభ్ర పరచాలని తెలిపారు. కాగా ఉదయం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి స్టేషన్‌రోడ్డు, సిరిసిల్లారోడ్డు, పంచముఖి హనుమాన్‌ కాలనీ రోడ్డు ప్రాంతాల్లో పర్యటన చేపట్టి రోడ్ల వెంట ఉన్న చెత్తను తీసివేయాలని, మురికికాలువలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ దేవేందర్‌, మున్సిపల్‌ అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T04:39:58+05:30 IST