మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో పారిశుధ్య లోపం

ABN , First Publish Date - 2022-06-27T04:02:00+05:30 IST

మాతా, శిశు ఆస్పత్రిలో పారిశుధ్య లోపం రోగులు ఇబ్బం దులు పడుతున్నారని, గర్భిణుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడు తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి ఆయన సందర్శిం చారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, పేషెంట్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మాతా, శిశు  సంరక్షణ కేంద్రంలో పారిశుధ్య లోపం
మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వాష్‌రూంలో అపరిశుభ్రత

మాతా, శిశు  సంరక్షణ కేంద్రంలో పారిశుధ్య లోపం

ఏసీసీ, జూన్‌ 26: మాతా, శిశు ఆస్పత్రిలో పారిశుధ్య లోపం రోగులు ఇబ్బం దులు పడుతున్నారని, గర్భిణుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడు తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు.  ఆదివారం పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి ఆయన సందర్శిం చారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, పేషెంట్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రఘునాధ్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో చెత్తను తొలగించడానికి, శుభ్రం చేయడా నికి 35 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం ఇద్దర్ని మాత్రమే నియ మించడంతో చెత్త పేరుకుపోయిందన్నారు. అపరిశుభ్రత వల్ల గర్భిణులు, శిశువులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఆసుపత్రిలో సరిపడ వైద్యులు లేక సరైన సమయంలో వైద్యం అందడం లేదన్నారు. సిబ్బందిని నియమించి ఆసు పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, ప్రభ, స్వప్నరాణి, లావణ్య, బోయిని హరికృష్ణ, ప్రదీప్‌చంద్ర, సతీష్‌రావు, రమేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-27T04:02:00+05:30 IST