మోరగుడిలో పడకేసిన పారిశుధ్యం

ABN , First Publish Date - 2021-03-07T04:34:25+05:30 IST

మండలంలోని మేజర్‌ పంచాయతీ అయిన మోరగుడి గ్రామంలో పారిశుధ్యం పడకేసింది.

మోరగుడిలో పడకేసిన   పారిశుధ్యం
ప్రధాన రోడ్డు పక్కన పేరుకు పోయిన చెత్తాచెదారాలు

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 6: మండలంలోని  మేజర్‌ పంచాయతీ అయిన మోరగుడి గ్రామంలో పారిశుధ్యం పడకేసింది.  గ్రామంలో డ్రైనేజీ సమస్య ప్రధానంగా సమస్యగా మారింది. మరో వైపు ప్రధాన రోడ్డుకు ఇరువైపుల చెత్తాచెదారంతో నిండి అపరిశుభ్రంగా ఉన్నాయి. డ్రైనేజీ కాలువ ల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోందన్నారు.  సంబంధిత అధికారులు స్పందించి చెత్త కుప్పలు తొలగించి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దాలని  గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2021-03-07T04:34:25+05:30 IST