‘పారిశుధ్యం’ పక్కాగా నిర్వహించాలి

Jun 17 2021 @ 00:40AM
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెకర్‌ సీ.నారాయణరెడ్డి, జిల్లాస్థాయి అధికారులు

వీడియో కాన్ఫరెన్‌లో కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 16: సీజనల్‌ వ్యాధులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు పక్కగా నిర్వహించాలని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి ఆదేశించా రు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామాల లో, మున్సిపాలిటీలలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణకు గ్రామం, మండలం, వారిగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. అటవీశాఖ సమన్వయంతో పెద్ద మొక్కలు నాటాలని, ఫారెస్ట్‌ అధికారి చెప్పిన విదంగా మొక్క లు నాటాలన్నారు. జిల్లాలో 9 క్రిమిటోరియంలు పెండింగ్‌లో ఉన్నాయని, 10 రోజులలో పూర్తి చేయాలని, లేదంటే చర్యలు ఉంటాయన్నారు. వైకుంఠధామాలను వాడుకోవాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనం ఇంకా 83 పెండింగ్‌లో ఉన్నాయని, స్థలం లేకుంటే కొనాలని, అన్ని కూడా తొందరగా పూర్తి కావాలన్నా రు. గత సంవత్సరం నాటిన మొక్కలు పరిశీలించి ట్రీ గార్డులు దెబ్బతిన్న చోట మార్చాలని, పాదులు ఏర్పాటు పరిశీలించాని,  జియో ట్యాగింగ్‌, ఆన్‌లైన్‌ నమోద పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ లత, వైద్యధికారి బాలనరేంద్ర, డీఆర్‌డీవో చందర్‌నాయక్‌, సీఈవో గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు.

‘ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలి’

పచ్చదనం పరిశుభ్రత, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంపై వీడీయో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఆదేశాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ హరితహారం ప్రగతి పల్లె పట్టణ ప్రగతి, శానిటేషన్‌, శ్మశానవాటికలు త్వరగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని, రెండు నెలల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లు పూర్తికావాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీలో వంద శాతం నర్సరీలు పూర్తికావాలన్నారు. మున్సిపాలిటీలు, అవెన్యూప్లాంటేషన్‌ మొక్కలు 8 నుంచి 10ఫీట్ల కంటే తక్కువ ఉండరాదన్నారు. మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలో చూసుకోవాలని పలు సూచనలు, సలహాలు అందజేశారు. అలాగే, అంగన్‌వాడి టీచర్‌, ఆశ వర్కర్‌, సిబ్బంది వారిగా టీంలు ఏర్పాటు చేసి సీజనల్‌ డిసీస్‌ వచ్చే ఏరియాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్‌ సిబ్బందితో మురుగు కాల్వల మట్టిని పూడిక తీయించాలని, వాటర్‌ నిల్వలు ఉండకుండా చూడాలన్నారు. ఇందులో అడిషనల్‌ కలెక్టర్‌ లత, మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి.పాటిల్‌, డీఎఫ్‌వో సునీల్‌, డీఆర్‌డీ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాల నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సన్నరకాల వరి విత్తనాల కొరతలేదు 

బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో తెలంగాణ స్టేట్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన గోడ ప్రతులను ఈ సంస్థ ఎండీ డాక్టర్‌ కేశవులుతో కలెక్టర్‌ కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం వరిలో సన్న రకాలను ప్రొత్సహించాలని, జిల్లాలో పెద్దఎత్తున వరి సాగవుతోందని, అందులో సన్న రకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా మార్కెట్‌లో ఆ ధాన్యానికి డిమాండ్‌ ఉంటుందని, మంచి ధరతో త్వరగా విక్రయించు కోగలుగుతారని, రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ఇందులో జేడీఏ  గోవింద, వ్యవసాయశాఖ సిబ్బంది ఉన్నారు.

మొక్కలను పరిశీలించిన కలెక్టర్‌

జిల్లాకేంద్రంలోని బైపాస్‌ రహదారి సమీపం లో నూతన సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డి బుధవారం పర్యటించి మొక్కలను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఖాళీ స్థలం కనబడకుండా మొక్కలు నాటాలన్నారు. డిచ్‌పల్లి నుంచి కొత్త కలెక్టరేట్‌ సముదాయం వరకు ప్లాంటేషన్‌ అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. 

Follow Us on: