వద్దన్నా.. వినరే!

ABN , First Publish Date - 2021-10-27T04:58:48+05:30 IST

చెత్త వేయడం నిషేధించడమైనది.

వద్దన్నా.. వినరే!
వీరవాసరంలో చెత్త వేయవద్దని పెట్టిన బోర్డు కింద వేసిన చెత్త

చెత్త బోర్డుల చెంతనే కుప్పలు 

పట్టించుకోని పంచాయతీ సిబ్బంది


వీరవాసరం, అక్టోబరు 26 :  చెత్త వేయడం నిషేధించడమైనది. ఎవరైనా అతిక్రమిస్తే పంచాయతీరాజ్‌ చట్టం 133 ప్రకారం రూ. 1000 జరిమానా, రేషన్‌ , పెన్షన్‌, విద్యుత్‌ ప్రభుత్వ పథకాలు రద్దుచేస్తాం... ఇది వీరవాసరం పంచాయతీ పరిధిలో పలు ప్రదేశాల్లో చెత్త వేయరాదంటూ ఏర్పాటు చేసిన  హెచ్చరిక బోర్డులు..అయితే ప్రజలు బోర్డు చూసి ఊరుకుంటారా? ఎక్కడ వేయవద్దని బోర్డు  పెట్టారో అక్కడే వేస్తున్నారు. వేసిన వ్యర్థాలను పారిశుధ్య సిబ్బంది తొలగించి మళ్లీ వేయవద్దని హెచ్చరించినా ఇదే పరిస్థితి. హెచ్చరిక బోర్డులైతే ఏర్పాటు చేశారు కానీ పంచాయతీ అధికారులు దీనిని పట్టించుకున్న దాఖలాలు లేవు. హెచ్చరికను మీరిన ఎన్ని కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను రేషన్‌, పెన్షన్‌, విధ్యుత్‌  రద్దు చేశారో రూ. 1000 జరిమానా వసూలు చేశారో వారికే తెలియాలి.  గ్రామంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి అయినా పట్టించుకునే నాథులే లేరు. 

Updated Date - 2021-10-27T04:58:48+05:30 IST