హామీలు తీర్చాలని పారిశుధ్య కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2021-06-22T05:00:21+05:30 IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను ప్రభుత్వం అమలు చేయాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు.

హామీలు తీర్చాలని పారిశుధ్య కార్మికుల నిరసన
నరసాపురంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న కార్మికులు

నరసాపురం టౌన్‌/ భీమవరం అర్బన్‌, జూన్‌ 21 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను ప్రభుత్వం అమలు చేయాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు.  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నరసాపురం కొప్పర్తి వేణుగో పాలరావు కాంప్లెక్స్‌ వద్ద, భీమవరంలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మి కులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం చర్చలతో కాలయా పన చేస్తుందే తప్ప కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ప్రభు త్వం ఇదే తంతు కొనసాగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని సంఘ రాష్ట్ర నాయకుడు నెక్కంటి సుబ్బారావు హెచ్చరించారు. ఏఐటీయూసీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు కిల్లరి మల్లేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు నెలకు రూ. 24 వేలు చెల్లించాలని, ఆప్కాస్‌ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో నెక్కంటి క్రాంతికుమార్‌, రత్తయ్య, నర్సింహారావు, ఎ.శ్రీనివాస రావు, ఎన్‌.ప్రసాద్‌, ఎస్‌.అంకాలు, జి.శ్రీను, బంగారు శివ, నీలాపు శ్రీను, సత్యనారయణ, అశీర్వాదం, జోసెఫ్‌, రెల్లి రాము తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:00:21+05:30 IST