పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం : భగత

ABN , First Publish Date - 2021-05-09T05:53:17+05:30 IST

మునిసిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు.

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం : భగత
పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భగత

హాలియా, మే 8 : మునిసిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. శనివారం ఆయన హాలియా మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి ఏ ఆప ద వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపొందాక  మునిసిపాలిటీకి తొలిసారి వచ్చిన భగతఉ చైర్మన్‌, కమిషనర్‌, కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చైర్మన్‌ వెంపటి పార్వతమ్మశంకరయ్య, ఎడమ కాల్వ మాజీ చైర్మన్‌ మలిగిరెడ్డి లింగారెడ్డి, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, కౌన్సిలర్లు వర్రా వెంకట్‌రెడ్డి, నల్లమోతు వెంకటయ్య, ప్రసాద్‌నాయక్‌, శ్రీనివాస్‌, నాయకులు అన్వరుద్దీన్‌, రావుల లింగయ్య, చెరుపల్లి ముత్యాలు, చల్లా మట్టారెడ్డి, నరేందర్‌రావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే భగత్‌
సాగర్‌ ఉప ఎన్నికలో తన విజయానికి సహకరించిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని ఎమ్మెల్యే భగత్‌ శనివారం హైదరాబాద్‌లోని ఆ యన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తేరా నోముల భగత్‌కు శుభాకాంక్షలు తెలిపి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-05-09T05:53:17+05:30 IST