పారిశుధ్య కార్మికులు సమ్మెబాట

Published: Wed, 26 Jan 2022 00:24:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పారిశుధ్య కార్మికులు సమ్మెబాట

కదిరిఅర్బన్‌, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో సమ్మెలోకి వెళ్తున్నట్లు కార్మికులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌ కార్మికులు, సీఐటీయూ నాయకులతో కలిసి స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీలకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవోఎంఎస్‌ నెంబరు 7 ు సవరించి, జీవో ఆర్‌టీ నెంబర్‌ 1615 అమలు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయా లన్నారు. జీవో నెంబరు 1617 ప్రకారం వేతనాలు, కరువు భత్యం, మధ్యంతర భృతి, ఇంటి అద్దెలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 7 వ తేది నుండి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో మున్సిప ల్‌ వర్కర్స్‌, యూనియన్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మీనా రాయణ, సీఐటీయూ నాయ కులు జగన్‌మోహన్‌, హరినాథ్‌రెడ్డి, మున్సిపల్‌ కార్మికులు తిరుపాల్‌, బాల క్రిష్ణ, చెన్నకేశవులు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.