డీఈవో కార్యాలయంవద్ద స్కూల్‌ శానిటేషన్‌ వర్కర్ల ధర్నా

ABN , First Publish Date - 2021-07-27T06:44:15+05:30 IST

జీవో నెం.22 ప్రకారం పూర్తి వేతనంతోపాటు బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ కాకినాడ డీఈవో కార్యాలయంవద్ద స్కూల్‌ శానిటేషన్‌ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.

డీఈవో కార్యాలయంవద్ద స్కూల్‌  శానిటేషన్‌ వర్కర్ల ధర్నా

కాకినాడ రూరల్‌, జూలై 26: జీవో నెం.22 ప్రకారం పూర్తి వేతనంతోపాటు బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ కాకినాడ డీఈవో కార్యాలయంవద్ద స్కూల్‌ శానిటేషన్‌ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ నాలుగైదేళ్లుగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తరగతిగదులు, పాఠశాల ఆవరణ పరిశుభ్రత కోసం నియమించిన శానిటేషన్‌ వర్కర్లతో పనిచేయించుకుని రెండేళ్లకు మాత్రమే వేతనాలు చెల్లించారన్నారు. రెండేళ్ల వేతనం బకాయిలున్నాయని, తాజాగా 2021, ఫిబ్రవరినుంచి రూ.6,000 వేతనం చెల్లిస్తామని జీవో22 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు మాట తప్పిందన్నారు. డీఈవో కార్యాలయం ఏడీ నాగేశ్వరరావు వర్కర్ల ధర్నా వద్దకు వచ్చి సమస్యలను విద్యాశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళతామని హామీఇచ్చారన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శానిటేషన్‌ వర్కర్స్‌ మండల నాయకులు సత్యవతి, దేవీ, లక్ష్మీ, అనూష, వెంకటలక్ష్మి, రత్నం పాల్గొన్నారు. ధర్నాకు యూటీఎఫ్‌ జిల్లా నాయకులు జ్యోతిబసు, చక్రవర్తి, నగేష్‌ మద్దతు ప్రకటించారు.

Updated Date - 2021-07-27T06:44:15+05:30 IST