కంపు భరించలేం..!

ABN , First Publish Date - 2020-12-03T04:49:48+05:30 IST

ఏలూరు నగరం, చుట్టు పక్కల గ్రామా ల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడు తున్నారు.

కంపు భరించలేం..!
తంగెళ్లమూడి లక్ష్మీనగర్‌లో ఖాళీ స్థలాల్లో మురుగునీరు, చెత్త

అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు 

ఖాళీ స్థలాల్లో నిలిచిన వర్షపు నీరు 

అధ్వానంగా మారిన పారిశుధ్యం

ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు 


ఏలూరు టూటౌన్‌,  డిసెంబరు 2: ఏలూరు నగరం, చుట్టు పక్కల గ్రామా ల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడు తున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నూతనంగా డ్రెయిన్లు నిర్మిం చడం ప్రారంభించారు. కరోనా కారణంగా వాటి నిర్మాణం మధ్యలోనే ఆగిపో యింది. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీల్లో, ఖాళీ స్థలాల్లో నీరు నిలిచిపోయింది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పాలక సంస్థ, పంచాయ తీల్లోని సిబ్బంది రోజుల తరబడి చెత్త ఎత్తక పోవడంతో కుళ్లిపోతోంది. దీనికి తోడు పందులు స్వైరవిహారం చేస్తూ పారిశుధ్యాన్ని మరింత అధ్వానంగా మా రుస్తున్నాయి. దోమల బెడద ఎక్కువై అనారోగ్యాల పాలవుతున్నామని, సంబం ధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యా దులు చేసినా పట్టించుకోవడం లేదని స్థా నికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన తంగెళ్లమూడి, సత్రంపాడు, శనివారపుపేట గ్రామాల్లోని పలు కా లనీల్లో ఇలాంటి దుస్థితి నెలకొని ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఖాళీ స్థలాలను శుభ్రపర్చడమే కాక, మధ్యలో నిలిపి వేసిన డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేయాల కోరుతున్నారు.  


త్వరలో పనులు ప్రారంభిస్తాం : ఠాగూర్‌, ఈవో తంగెళ్లమూడి 

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణాలు ఈ ఏడాది జనవరిలో ప్రారం భించాం. కొవిడ్‌ కారణంగా కాంట్రాక్టర్లు కూలి వాళ్లు దొరకక పనులు నిలిపివేశారు. కాంట్రాక్టరు పనులు తిరిగి ప్రారంభించడానికి సమ్మతించారు. త్వరలో పనులు తిరిగి ప్రారంభమవుతాయి.  


ఖాళీ స్థలాలను శుభ్రపర్చాలి

తంగెళ్లమూడి పంచాయతీ పరిధిలో నివాసాల మధ్య ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి దుర్వాసన వ స్తోంది. పంచాయతీ సిబ్బంది రోజువారీ చెత్తను కూడా ఎత్తడం లేదు. నీరు దీంతో చెత్త కుళ్లిపోయి దానిపై పందులు దొర్లాడుతున్నాయి. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరును తొలగించాలి. 

– సాల్మన్‌ రాజు, తంగెళ్లమూడి


డ్రెయినేజీని మెరుగు పర్చాలి

లక్ష్మీనగర్‌ కాలనీలో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేవు. జనవరిలో రోడ్లు, డ్రెయిన్ల పనులు ప్రారంభించినా మధ్యలో ఆపేశారు. ఇప్పటి వరకూ తిరిగి ప్రారంభించ లేదు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు చేరి నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తూ పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది.  వెంటనే డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలి.

 – అగస్టీన్‌, లక్ష్మీనగర్‌  

Updated Date - 2020-12-03T04:49:48+05:30 IST