ఆ పాపం పర్ఫెక్ట్‌దే

ABN , First Publish Date - 2020-08-09T11:02:41+05:30 IST

కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు చివరి దశకు చేరుకుంది.

ఆ పాపం పర్ఫెక్ట్‌దే

ముగింపు దశకు శానిటైజర్‌ కేసు

సిట్‌ బృందం అదుపులో కీలక సూత్రధారితో పాటు మరో ఆరుగురు

డిస్ట్రిబ్యూటర్ల కోసం వేట


కురిచేడు, ఆగస్టు 8: కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. పర్ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌తోనే కురిచేడులో ఎక్కుశాతం మంది మృతి చెందినట్లు తేలింది. కంపెనీ మూలాలు హైదరాబాద్‌లో ఉండటంతో సిట్‌ బృందం అక్క డే ఉండి కంపెనీ తయారు చేసే స్థలానికి వెళ్ళి అక్కడ ముడి సరుకును, తయారు చేసిన శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యజమాని శ్రీనివాస్‌ను సిట్‌ బృందం అదుపులోకి తీ సుకుంది. శనివారం తెల్లవారు జామున శానిటైజ ర్‌ తయారికి వినియోగించిన ముడి కెమికల్‌ను ఇక్కడకు తీసుకు వచ్చారు. అదుపులోకి తీసుకు న్న వారిని ఆదివారం కురిచేడుకు తీసుకు రానున్నట్లు సమాచారం. 


లేబుల్‌ మార్చి అమ్మకాలు

పర్ఫెక్ట్‌ కంపెనీ తయారుచేసిన శానిటైజర్లు తా గే కురిచేడులో ఎక్కువ మంది ప్రాణాలు కో ల్పోయారు. అయితే, ఈ కంపెనీ పేరుమీద శానిటైజర్‌ తయారు చేసి అమ్మినా పెద్దగా అమ్మకా లు జరుగక పోవడంతో కంపెనీ యజమాని శ్రీ నివాస్‌ లేబుల్‌ మార్చడానికి సిద్ధమయ్యారు. వం దన ఫార్మాసూటికల్స్‌ పేరుతో లేబుల్స్‌ తయారు చేసి శానిటైజర్లు తయారు చేయించాడు. శానిటైజర్‌ తయారీలో వినియోగించాల్సిన ఇథైల్‌ ఆల్క హాల్‌ బదులుగా మిథైల్‌ క్లోరైడ్‌ను కలిపి తయా రు చేసినట్లు తయారీ యూనిట్‌లో సిట్‌ బృందానికి ఆనవాళ్ళు చిక్కాయి. మిథైల్‌ క్లోరైడ్‌ శరీరంలో కలిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కు రిచేడులో శానిటైజర్‌ తాగిన వారిలో అదే జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు.


పర్ఫెక్ట్‌ కంపెనీలో తయారయిన శానిటైజర్లు హైదరాబాద్‌ ను ంచి పిడుగురాళ్ళకు,  అక్కడ నుంచి దర్శి, కురిచే డుకు చేరాయి. హైదరాబాద్‌లో సదరు కంపెనీకి చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకునట్లు తెలుస్తున్నది. వీరిని ఆదివారం కురిచేడుకుగాని, ఒంగోలుకు గాని తీసుకురానున్నట్లు  సమాచారం. ప్రస్తుతం డిస్టిబ్ర్యూటర్ల కోసం పోలీసులు వెతుకుతున్నట్లు తెలుస్తున్నది.  హైదరాబాద్‌ నుంచి పర్ఫెక్ట్‌ కంపెనీకి చెందిన రసాయన డ్రమ్ములు, తయారుచేసిన శానిటైజర్లు లారీలో కురిచేడు పోలీస్‌ స్టేషన్‌కు శనివారం చేరింది. 

Updated Date - 2020-08-09T11:02:41+05:30 IST