Advertisement

పాపం పోలీసులు.. చుక్కలు చూపిస్తున్న సంజన, రాగిణి!

Oct 10 2020 @ 16:08PM

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన హీరోయిన్లు జైల్లో గొడవపడుతున్నారా? వీరి తీరుతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారా? అవును.. తాజాగా ఓ కన్నడ ఛానెల్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్న రాగిణి, సంజన `నువ్వా.. నేనా?` అంటూ పోట్లాడుకుంటున్నారట. వీరిద్దరి మధ్య ఎప్పట్నుంచో విభేదాలున్నాయి. 


వీరిద్దరిలో ఒకరంటే ఒకరికి పడదని శాండల్ వుడ్ టాక్. వీరి మధ్య వృత్తిపరమైన విభేదాలున్నాయని సమాచారం. అయితే దురదృష్టవశాత్తూ ఇద్దరూ ఇప్పుడు ఒకే జైల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారట. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ఒకే సెల్‌లో వీరిద్దరినీ ఉంచారట. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా లైట్లు వేసుకుని రాగిణి పుస్తకాలు, దినపత్రికలు చూస్తోందట. మళ్లీ ఉదయాన్నే నిద్ర లేచి లైట్లు వేసుకుని యోగాసనాలు వేస్తోందట. అలా లైట్లు వెలుగుతూ ఉండడం వల్ల తనకు నిద్ర పట్టడం లేదని సంజన ఫిర్యాదు చేస్తోందట. అలాగే మరికొన్ని విషయాల్లో సంజనపై రాగాణి కంప్లైంట్లు చేస్తోందట. వీళ్ల ఫిర్యాదులతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారట. ఈ హీరోయిన్లద్దరికీ బెయిల్ త్వరగా వచ్చేయాలని వారి కంటే పోలీసులే ఎక్కువగా కోరుకుంటున్నారట. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.