రాహుల్‌కే టెస్టు సారథ్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-18T10:42:14+05:30 IST

కేఎల్‌ రాహుల్‌కు భారత టెస్టు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్‌ జగ్దాలే అభిప్రాయపడ్డాడు.

రాహుల్‌కే టెస్టు సారథ్యం ఇవ్వాలి

సంజయ్‌ జగ్దాలే 

ఇండోర్‌: కేఎల్‌ రాహుల్‌కు భారత టెస్టు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్‌ జగ్దాలే అభిప్రాయపడ్డాడు. ‘కొత్త కెప్టెన్‌ ఎవరైనా జట్టును సుదీర్ఘ కాలం పాటు నడిపించే విధంగా ఉండాలి. ఈక్రమంలో 29 ఏళ్ల రాహుల్‌ సరైన వ్యక్తి అని నా అభిప్రాయం. అలాగే తను మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ఫామ్‌ను కనబరుస్తున్నాడు’ అని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం ఆఫీస్‌ బేరర్‌ కూడా అయిన జగ్దాలే గుర్తుచేశాడు. ఇక భారత జట్టుకు సారథిగా కోహ్లీ అందించిన సేవలను ఎవరూ తక్కువ చేయలేరని తేల్చాడు. అంతేకాకుండా భారత క్రికెట్‌ పాలసీల్లో ఐపీఎల్‌లో అధికారం చెలాయిస్తున్న వ్యక్తులు జోక్యం చేసుకోకూడదని సూచించాడు.

Updated Date - 2022-01-18T10:42:14+05:30 IST