Slumdog Husband గా బ్రహ్మాజీ తనయుడు

Published: Sun, 29 May 2022 13:32:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Slumdog Husband గా బ్రహ్మాజీ తనయుడు

ప్రముఖ నటుడు బ్రహ్మీజీ (Brahmaji) తనయుడు సంజయ్ రావు (Sanjay Rao) ‘ఓ పిట్టకథ’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి రెస్పాన్స్‌నే తెచ్చుకుంది. అయినప్పటికీ  ఆ తర్వాత సంజయ్ రావు హీరోగా మరో సినిమా అనౌన్స్ అవలేదు. ఎట్టకేలకు ఇప్పుడీ హీరో ఓ వెరైటీ కాన్సెప్ట్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా పేరు ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్’ (Slumdog Husband). ప్రణవి మానుకొండ కథానాయికగా నటిస్తుండగా.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీథర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్ పై  అక్కిరెడ్డి, వెంకట్ అన్నపురెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 


తాజాగా ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్’ చిత్రం మోషన్ పోస్టర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. మోషన్ పోస్టర్ ఎంతో హ్యూమరస్ గా ఉందన్న రానా చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. వివాహాల్లో  కొంతమంది పాటిస్తున్న కొన్ని మూఢనమ్మకాల్ని దర్శకుడు ఈ సినిమాతో వినోదాత్మకంగా ఎలివేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐశ్వర్యారాయ్‌కు చెట్టుతో పెళ్ళిచేయడం, కొందరు వరులకు జంతువులతో పెళ్ళి చేసిన న్యూస్ క్లిపింగ్స్, రాశుల ఫోటోలు మోషన్ పోస్టర్ లో కనిపిస్తాయి. సరిగ్గా ఇలాగే ఈ సినిమాలో హీరోకు కూడా ఓ కుక్కుతో పెళ్ళి జరిపిస్తారు. ఆ కుక్కపై హోలీ రంగుజల్లితే.. అర్జున్ రెడ్డి సినిమా తరహాలో ‘ఎవడ్రా నా కుక్కపై రంగుపోసింది’ అనడం నవ్విస్తోంది. ‘మిమ్మల్ని ఈ పెళ్ళికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం’ అంటూ మోషన్ పోస్టర్ ను ముగించారు. చమ్మక్ చంద్ర, గుండు సుదర్శనం, సప్తగిరి, ఫిష్ వెంకట్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా సంజయ్ రావుకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International