రాజ్యసభ ఛైర్మన్‌కు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లేఖ

ABN , First Publish Date - 2022-02-09T14:22:10+05:30 IST

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాడులపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు...

రాజ్యసభ ఛైర్మన్‌కు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లేఖ

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాడులపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగిస్తోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.ఈ మేర  సంజయ్ రౌత్  రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సహాయం చేయమని కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారని, తద్వారా మధ్యంతర ఎన్నికలు నిర్వహించుకోవాలని వ్యూహం పన్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. తాను వారి సంప్రదింపులను తిరస్కరించినందున తనను బెదిరిస్తున్నారని ఎంపీ లేఖలో పేర్కొన్నారు.


మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై ప్రధాని నరేంద్ర మోదీ దాడి చేయడంతో ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాని ప్రసంగంపై స్పందించిన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మళ్లీ ‘రెండు భారతదేశాలు’ అంశాన్ని లేవనెత్తారు. లోక్‌సభలో సభ్యులు కర్నాటక హిజాబ్‌ వివాదాన్ని లేవనెత్తారు.


Updated Date - 2022-02-09T14:22:10+05:30 IST