శ్రీలంక దారిలోనే భారత్: సంజయ్ రౌత్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-04-05T23:29:41+05:30 IST

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మన దేశ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఇండియా కూడా శ్రీలంక దారిలోనే పయనిస్తోంది. ఇప్పుడే ఈ పరిస్థితిపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు..

శ్రీలంక దారిలోనే భారత్: సంజయ్ రౌత్ హెచ్చరిక

ముంబై: శ్రీలంక ఎంతటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటోందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇండియా కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అదే దారి వైపు పయనిస్తోందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ హెచ్చరించారు. ఇప్పటి పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే మన దేశ పరిస్థితి శ్రీలంక కంటే తీవ్రంగా తయారు అవుతుందని ఆయన అన్నారు. దీని కోసం ప్రధానమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం అవసరమని సంజయ్ రౌత్ సూచించారు.


‘‘శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మన దేశ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఇండియా కూడా శ్రీలంక దారిలోనే పయనిస్తోంది. ఇప్పుడే ఈ పరిస్థితిపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోకపోతే శ్రీలంక కంటే కూడా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సమాజ్‌వాదీ నేత రాంగోపాల్ యాదవ్ కూడా ఇదే అన్నారు. దీని పరిష్కారానికి మమత బెనర్జీ ఒక సూచన చేశారు. ప్రధానమంత్రి నేతృత్వంలో వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. నేను కూడా ఇదే సూచిస్తున్నాను’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

Updated Date - 2022-04-05T23:29:41+05:30 IST