ఇరువురు టీచర్లకు సంజాయిషీ నోటీసులు

ABN , First Publish Date - 2021-11-27T06:10:43+05:30 IST

పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో విధుల కు హాజరు కాని ఇరువురు ఉపా ధ్యాయులకు డీఈవో బి.విజయ భాస్కర్‌ శుక్రవారం సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.

ఇరువురు టీచర్లకు సంజాయిషీ నోటీసులు
రికార్డులను తనిఖీ చేస్తున్న డీఈవో విజయభాస్కర్‌

ఒంగోలువిద్య, నవంబరు 26 : పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో  విధుల కు హాజరు కాని ఇరువురు ఉపా ధ్యాయులకు డీఈవో బి.విజయ భాస్కర్‌ శుక్రవారం సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. గిద్దలూ రు మండలంలోని దిగువమిట్ట మండల పరిషత్‌ ప్రాఽథమిక పా ఠశాలను శుక్రవారం ఉదయం 9.20 గంటలు డీఈవో అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మొత్తం ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, ఒక ఉపాధ్యాయు డు మాత్రమే విధులకు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయుడు సెలవు చీటీ లేకుండా విధులకు గైరుహాజరయ్యారు. మరో ఉపాధ్యాయిని ఆలస్యంగా వచ్చారు. విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరవడం పట్ల డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వురు టీచర్లకు ఛార్జీ మోమోలు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడు తూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవ హరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Updated Date - 2021-11-27T06:10:43+05:30 IST