సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-13T06:19:49+05:30 IST

హరిదాసు సురుచిర హరికీర్తనావళుల్‌ కోవిడ్డు వెతలను కోతవెట్ట! ముంగిళ్ళ అంగనల్‌ రంగవల్లుల శోభ...

సంక్రాంతి

హరిదాసు సురుచిర హరికీర్తనావళుల్‌

కోవిడ్డు వెతలను కోతవెట్ట!

ముంగిళ్ళ అంగనల్‌ రంగవల్లుల శోభ

గతసాలువెతలను హతముసేయ!


గంగిరెద్దుల నాట్యకమనీయ ఘట్టనల్‌

భయదకరోనాను పాతివెట్ట!

సంక్రాంతి వేళల సం–క్రాంతి రాగను

కర్షకాళికినెదల్‌ హర్షమొదవ!


తే. మంచుముత్యాలుదాలిచి నలరుబోండ్లు

కొమ్మ వెలుగెత్తిపాడెడి గొబ్బిపాట

కరకు దరిగిన దొర దినకరుని కాంతి

స్వాగతించగ; సంక్రాంతి నేగుదెంచె!

మోదుకూరు రాధాకృష్ణ శర్మ

Updated Date - 2021-01-13T06:19:49+05:30 IST