అంబరాన్నింటిన సంబరాలు

ABN , First Publish Date - 2021-01-16T06:03:18+05:30 IST

సంక్రాంతి వేడుకలు గురు, శుక్రవారాల్లో వైభవంగా నిర్వహించారు. మహిళలు ఇళ్ల ముందు వేసిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అంబరాన్నింటిన సంబరాలు
యాగంటిలో ఉమామహేశ్వరస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు

  1. వైభవంగా సంక్రాంతి వేడుకలు


సంక్రాంతి  వేడుకలు గురు, శుక్రవారాల్లో వైభవంగా నిర్వహించారు. మహిళలు ఇళ్ల ముందు వేసిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బంధువులతో ఇళ్లు కళకళలాడాయి.  ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.   పలు ఆలయాల్లో కల్యాణోత్సవాలు,  ఊరేగింపు నిర్వహించారు. గోమాతను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.






నంద్యాల (కల్చరల్‌), జనవరి 15: నంద్యాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో సంక్రాంతి వేడుకలను నిర్వహిం చుకున్నారు. గురువారం మహిళలు తమ ఇంటి ముంగిట రంగవల్లికలు వేశారు. అయ్యప్ప స్వామి దేవస్థానంలో గురువారం మకర సంక్రాంతి సందర్బంగా అర్చకులు లోకేష్‌ అర్చకత్వంలో స్వామివారికి ఉదయం అభిషేకాలు నిర్వహిం చారు. సాయంత్రం పడిపూజ, భజన కార్యక్రమా లను నిర్వహించారు. అయ్యప్ప సేవాసమాజం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


బనగానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో ఆలయ ఈవో రామానుజన్‌, ఆలయ చైర్మన్‌ పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుక్రవారం గోపూజ నిర్వహించారు. పిల్లలకు ఆధ్యాత్మిక క్విజ్‌ పోటీలు నిర్వహించి చైర్మన్‌, ఈవోలు బహుమతులు అందించారు.


 యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరస్వామి పల్లకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌, ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఉమామహేశ్వరులను పాతపాడు, మీరాపురం, యాగంటిపల్లె గ్రామాల్లో ఊరేగించారు. నాయకులు బుచ్చిరెడ్డి, మనోహర్‌రెడ్డి, గడ్డం వెంకటేశ్వరరెడ్డి, పైపుల రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, వీఆర్‌వో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌, ఆలయ ప్రధాన అర్చకుడు మహేశ్‌, ఇతర పూజారులు, సిబ్బంది ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. కిశోర్‌ ప్రతాప్‌రెడ్డి, చిన్నపుల్లారెడ్డి, రోశిరెడ్డి, మద్దిలేటిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, నాగసుబ్బారెడ్డితో పాటు అధిక సంఖ్యలో భక్తులు గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


 శ్రీశైలం: కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానం గో పూజా మహోత్సవాన్ని నిర్వహించింది. నిత్య గో సేవతో పాటు విశేషంగా ఈ రోజు 11 గోవులకు, 11 గోవత్సాలకు(ఆవుదూడలకు) శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ముందుగా అర్చకులు, వేదపండితులు లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని సంకల్పాన్ని పఠించారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గోఅష్టోత్తర మంత్రంతోనూ షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపించారు. అనంతరం గోవులన్నింటికి నూతన వస్త్రాలు సమర్పించారు.


మహానంది: మహానంది క్షేత్రంలో మకరా సంక్రాంతి పర్వదినం పురష్కరించుకొని ఆలయంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయం శివాలయంలో ఉదయం నుంచి గణపతిపూజ, పుణ్యహవచనంతో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం కనుమ పర్వదినం పురస్కరించుకొని ఉత్సవమూర్తులను ఆలయ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మహానంది శివారు ప్రాంతంలోని పార్వేట ఉత్సవాన్ని జరిపారు. యువతకు పరుగుపందెంను నిర్వహించి విజేతకు బహుమతి అందచేసి సత్కరించారు. ఆలయ ఈవో మల్లికార్జునప్రసాద్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ హరినాఽథ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డిల పాల్గొన్నారు. బుక్కాపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం పార్వేట ఉత్సవం ముందు నిర్వహించిన పరుగు పందెంలో వరుసగా నాల్గవ సారి గ్రామానికి చెందిన వెంకటరమణ గెలుపొందారు. గాజులపల్లి ఆర్‌ఎస్‌ సమీపంలోని మరకత లింగేశ్వరుని ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో ఆలయంలో భక్తి శ్రధ్దలతో ఆలయ నిర్వాహకుడు, పండితుడు కనుమర్లపూడి మస్తాన్‌రావు ఆధ్వర్యంలో మరకతలింగేశ్వరునికి ప్రత్యేకంగా అలంకరించారు. 


 మహానంది క్షేత్రం పరిధిలోని నంది విగ్రహాం సర్కిల్‌ ముందు  గో మహాలక్ష్మికి గోపూజను ఆలయ వేదపండితులు రవిశంకర్‌అవదాని, నాగేశ్వరశర్మ, హనుమంతరావు శర్మ వేదమంత్రాలతో గోవులకు నిర్వహించారు. దేవస్దానం గోశాల లోని గోవులను అర్చకుడు శరభయ్యశర్మ ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈవో మల్లికార్జునప్రసాద్‌, వైసీపీ శ్రీశైలం నియోజికవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, దేవస్థానం నిత్యాన్నదాన సత్రం కూరగాయల దాత నంద్యాలకు చెందిన లక్కబోయున ప్రసాద్‌, వైసీపీ మహానంది మండల కన్వీనర్‌ పాలమహేశ్వరరెడ్డి, నాయకులు కందుల రఘరామిరెడ్డి, కొమ్మా శివప్రసాదరెడ్డి, జయసింహారెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు బుసగాని వెంకటేశ్వర్లు, గంగిశెట్టి మల్లికార్జునశెట్టి, దేవస్థానం టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ హరినాథ్‌ పాల్గొన్నారు.


ఆళ్లగడ్డ: అహోబిలం పార్వేట ఉత్సవ పల్లకి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి, డీఎస్పీ రాజేంద్ర, ఈవో నరసయ్య, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి, వైసీపీ నాయకులు రాఘవేంద్రారెడ్డి, గంధం రాఘవరెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు, పల్లకి ప్రారంభోత్సవంలో ముందుగా చెంచులు ఉత్సవమూర్తులకు మొదటగా టెంకాయ కొట్టగా ఆ తరువాత ఎమ్మెల్సీ దంపతులు, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి టెంకాయ కొట్టి పల్లకిని గ్రామాలకు సాగనంపారు.




Updated Date - 2021-01-16T06:03:18+05:30 IST