‘సంతూర్ మ్యాస్ట్రో’ పండిట్ Bhajan Sopori కన్నుమూత

ABN , First Publish Date - 2022-06-02T23:40:08+05:30 IST

సంతూర్(వాయిద్య పరికరం) మ్యాస్ట్రో, ప్రముఖ సంగీత స్వరకర్త పండిట్ భజన్ సొపోరి(Pandit Bhajan Sopori ) కన్నుమూశారు.

‘సంతూర్ మ్యాస్ట్రో’ పండిట్ Bhajan Sopori కన్నుమూత

న్యూఢిల్లీ : సంతూర్(వాయిద్య పరికరం) మ్యాస్ట్రో, ప్రముఖ సంగీత స్వరకర్త పండిట్ భజన్ సొపోరి(Pandit Bhajan Sopori ) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఫోర్టీస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాశ్మీర్‌లోని సొపోరే లోయకు చెందిన ఆయన 1948లో జన్మించారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలోని సుఫియానా ఘరానకు చెందిన ఆయన కేవలం 5 ఏళ్ల చిరుప్రాయంలోనే 1953లో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలపాటు కెరీర్‌ను కొనసాగించారు.


ఈజిప్ట్, ఇంగ్లండ్, జర్మనీతోపాటు అమెరికాలో కూడా భజన్ సొపోరి ప్రదర్శనలు ఇచ్చారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. తాత ఎస్‌సీ సొపోరి, తండ్రి శంభూ నాథ్‌ల నుంచి హిందుస్థానీ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఏకంగా వాషింగ్టన్ యూనివర్సిటీలో సంగీత పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.  భారతీయ శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవకుగానూ భజన్ సొపోరికి 1992లో సంగీత నాటక్ అకాడమీ అవార్డ్, 2004లో పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. కాగా గత నెల్లలోనే దిగ్గజ సంగీతకారుడు, సంతూర్ ప్లేయర్ పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. గత ఆరు నెలలపాటు ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు. డయాలసిస్ కూడా జరిగింది.   

Updated Date - 2022-06-02T23:40:08+05:30 IST