నెటిజన్లకు కౌంటరిచ్చిన సనుషా

Jun 13 2021 @ 18:42PM

‘రేణిగుంట’ చిత్రం ద్వారా కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్‌ సనుషా. ఈ చిత్రంలో ఆమె మూగ యువతిగా నటించి ప్రతిఒక్కరి ప్రశంసలు పొందింది. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా వుండే సనుషా... అప్పుడప్పుడూ ఫొటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమె శరీరాకృతిపై వివిధ రకాలైన కామెంట్స్‌ చేశారు. వీటికి ధీటుగా ఆమె కౌంటరిచ్చింది. ఎవరైతే తన శరీరాకృతి గురించి కామెంట్స్‌ చేస్తున్నారో అలాంటి వారందరికీ తాను చెప్పేది ఒక్కటేనని, తనను కామెంట్‌ చేసేవారి చేతి వేళ్ళలో ఒక వేలు నా వైపు చూపిస్తే, మిగిలిన చేతివేళ్ళు మీవైపే చూపిస్తున్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, తన శరీరాకృతిపై కామెంట్స్‌ చేసేముందు మీరంతా మానసింగా ఆరోగ్యవంతులు కావాలంటూ కౌంటరిచ్చింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.