సారా మీరొక హీరో: సోనూసూద్‌

May 8 2021 @ 14:54PM

కరోనా బాధితులు, పేద కార్మికుల అండగా ఉంటూ శక్తిమేరకు సహకరిస్తున్నారు సోనూసూద్‌. సహయం అన్నవారికి ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నారాయన. కొవిడ్‌ 19 సేవా కార్యక్రమాల కోసం ఆయన ప్రారంభించిన సూద్‌ ఫౌండేషన్‌కు సహకరించడానికి బాలీవుడ్‌ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. తాజాగా యువ కథానాయిక సారా అలీఖాన్‌ సోనూ ఛారిటీ ఫౌండేషన్‌కు సహకరించింది. ఈ విషయాన్ని సోనూసూద్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా సారా అలీఖాన్‌ను అభినందించారు. ‘‘డియర్‌ సారా అలీఖాన్‌ మీరు చేసిన సహకారానికి కృతజ్ఞతలు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇలాగే ముందుకెళ్లంది. విపత్కర పరిస్థితుల్లో మీలాంటి యంగ్‌స్టర్స్‌ స్పందించి సహాయం అందించడం దేశ యువత మొత్తానికి స్ఫూర్తిగా ఉంటుంది. మీరు హీరో’’ అని ట్వీట్‌ చేశారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.